రీ ఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ అనే ఎపిక్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారీ సినిమా కోసం.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ సినిమాని స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇదే తరహాలో మరో ఎపిక్ మూవీని ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్యనే ఓ సీనియర్ డైరెక్టర్ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారట. కథ వినగానే వర్కవుట్ చేద్దాం అని సూచించారట చిరంజీవి. అయితే, ఎపిక్ స్టోరీ కావడంతో.. కాస్త టైమ్ తీసుకుని పక్కాగా డెవలప్ చేయమని ఆ డైరెక్టర్‌కి సూచించారట చిరంజీవి.
దాదాపు కథను ఫైనల్ చేసే పనిలో ఆ డైరెక్టర్ టీమ్ వర్క్ చేస్తోందట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్. అయితే, ఇప్పటికే చిరంజీవి చేయాల్సిన సినిమాల లిస్టు పెద్దగానే వుంది. మళ్లీ ఎపిక్ మూవీ అంటే.. టైమ్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి మరి.