చిరంజీవి ఖాతాలో మరో ఎపిక్ మూవీ.?

రీ ఎంట్రీలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ అనే ఎపిక్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించారీ సినిమా కోసం.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాని స్వయంగా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇదే తరహాలో మరో ఎపిక్ మూవీని ప్లాన్ చేస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్యనే ఓ సీనియర్ డైరెక్టర్ చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేశారట. కథ వినగానే వర్కవుట్ చేద్దాం అని సూచించారట చిరంజీవి. అయితే, ఎపిక్ స్టోరీ కావడంతో.. కాస్త టైమ్ తీసుకుని పక్కాగా డెవలప్ చేయమని ఆ డైరెక్టర్‌కి సూచించారట చిరంజీవి.

దాదాపు కథను ఫైనల్ చేసే పనిలో ఆ డైరెక్టర్ టీమ్ వర్క్ చేస్తోందట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయ్. అయితే, ఇప్పటికే చిరంజీవి చేయాల్సిన సినిమాల లిస్టు పెద్దగానే వుంది. మళ్లీ ఎపిక్ మూవీ అంటే.. టైమ్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి మరి.