సితార పాప.! సినిమా కథ.! ఎప్పుడంటే.?

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార తెరంగేట్రానికి సర్వం సిద్ధమైందట. ప్రస్తుతం ఓ కమర్షియల్ యాడ్ లో సితార నటిస్తోందట. దీని తర్వాత సితార కోసం ఓ స్ర్కిప్టు సిద్ధం చేశారనీ తెలుస్తోంది.

మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడైన వంశీ పైడిపల్లి ఈ స్ర్కిప్టు సిద్ధం చేశారనీ తెలుస్తోంది. అయితే, అది పూర్తి సినిమానా.? లేక షార్ట్ ఫిలిం తరహాలో వుంటుందా.? అనేది తెలియాల్సి వుంది. త్వరలోనే ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నారట.

మహేష్ బాబు ముద్దుల తనయ అని మాత్రమే కాకుండా, సితారకు సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వుంది. ఎప్పటికప్పుడు స్పెషల్ ఫోటో షూట్లంటూ, డాన్సింగ్ వీడియోలంటూ.. స్పెషల్ చిట్ చాట్స్ అంటూ తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకుంది సితార పాప.

అలాగే, మహేష్ బాబు నటించిన ’సరిలేరు నీకెవ్వరు‘ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ లోనూ సితార డాన్స్ చేసింది. ’పెన్నీ పెన్నీ..‘ అంటూ సాగే వీడియో సాంగ్‌లో సితార పాప క్యూట్ క్యూట్ స్టెప్పులకు అభిమానులే కాదు, యావత్ సినీ జనం ఫిదా అయిపోయారు.