మల్టీ స్టారర్ సన్నాహాల్లో మహేష్ బాబు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ఆ తరహా మల్టీ స్టారర్ మూవీలో నటించాలనుకుంటున్నాడట మహేష్ బాబు. ఈ సారి మహేష్ మనసులో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో వున్నట్లు టాక్.

అయితే, మహేష్‌నీ, పవన్‌నీ మ్యానేజ్ చేయాలంటే, త్రివిక్రమ్ లాంటి దర్శకుడి వల్లే అవుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి వుంది. మరి, మహేష్ అనుకుంటున్నట్లు పవన్‌తో మల్టీ స్టారర్ ఎలా.? అంటే ఇది ఇప్పట్లో సాధ్యపడే విషయమే కాదు.

ఎందుకంటే, రాజమౌళితో సినిమా అంటే, ఇప్పట్లో తెవిలే యవ్వారం కాదాయె. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అంటూ రాజకీయాల్లో బిజీ అయిపోనున్నారు. చూడాలి మరి.