‘బ్రో’ కోసం బిగ్ బ్రదర్ వస్తున్నారట.!

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘బ్రో’ సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ సినిమా నుంచి పోస్టర్లు వస్తున్నాయ్.! ముందు ముందు ఈ జోష్ మరింతగా పెరగనుంది.

తక్కువ బడ్జెట్‌తో తమిళంలో తెరకెక్కిన ‘వినోదయ సితం’ సినిమాని తెలుగులోకి ‘బ్రో’ పేరుతో భారీ బడ్జెట్ చిత్రంగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

కేవలం పవన్ కళ్యాణ్‌కే దాదాపు 70 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ కూడా గట్టిగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు ఈ సినిమాతో.

ఇదిలా వుంటే, ‘బ్రో’ సినిమా కోసం ‘బిగ్ బ్రదర్’ రాబోతున్నారట. ఆయనెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. అది మాట సాయమా.? లేదంటే, సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో కనిపించడమా.? అన్నదనిపై స్పష్టత రావాల్సి వుంది.