జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల హడావిడి నుంచి కాస్త సేద తీరుతున్నారు ఇప్పుడిప్పుడే.! కాకపోతే, అసలు సిసలు పొలిటికల్ హడావిడి ఇకపై మరింత ఎక్కువగా వుండబోతోందన్న వాదన లేకపోలేదు.
మరోపక్క, పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి ఎప్పుడొస్తారా.? అని ఆయనతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. మూడు సినిమాలు నిర్మాణ దశలో వున్నాయి. అందులో ఒకటి ‘హరి హర వీర మల్లు’ కాగా, ఇంకోటి ‘ఓజీ’, మూడోది ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
‘ఏడాదిలోపే మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసేస్తా..’ అని ఎన్నికలకు ముందర, ఆయా నిర్మాతలకి పవన్ కళ్యాణ్ మాటిచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా నిర్మాతలు త్వరలో పవన్ కళ్యాణ్‌ని కలవబోతున్నారట.
ఎన్నికల ఫలితాల కంటే ముందరే ఈ భేటీ వుండబోతోందని సమాచారం. పవన్ కళ్యాణ్‌కి ఎలాంటి ఇబ్బందీ లేకుండా, ఆంధ్ర ప్రదేశ్‌లోనే సెట్స్ వేసేసి మరీ, ఆయా సినిమాల్ని పూర్తి చేయాలనే ఆలోచనలతో ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు వున్నారని తెలుస్తోంది.
ఈ విషయమై గతంలోనే ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు ఓ ప్రకటన కూడా చేశారు. అయితే, అప్పట్లో వారాహి విజయ యాత్ర సందర్భంగా ఎలాంటి సినిమా షూటింగులకూ గ్యాప్ దొరకలేదు. ఇకపై అయినా, పవన్ కళ్యాణ్‌కి సినిమాలకు కేటాయించేంత సమయం దొరుకుతుందా.?
దొరికి తీరాల్సిందే.! లేకపోతే, నిర్మాతలు దెబ్బయిపోరూ.?