ఔను, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మాజీ ముఖ్యమంత్రి జైలుకు వెళ్ళడం.. అదీ అవినీతి కేసులో ఇదే తొలిసారి.! ఇది తిరుగులేని రికార్డ్.!
అడిగి మరీ అరెస్టు చేయించుకున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని సర్వేలు చెబుతున్న వేళ, సింపతీ కోసం అరెస్టవ్వాలన్న కసి చంద్రబాబులో పెరిగిపోయింది. ఈ క్రమంలో అధికార పార్టీని తూలనాడారు. ముఖ్యమంత్రినీ బూతులు తిట్టారు. తప్పుడు పుట్టక.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రిని తిట్టారనో, ఇంకోటనో చంద్రబాబుని అరెస్టు చేశారని అనలేం. దమ్ముంటే అరెస్ట్ చెయ్.. అంటూ చంద్రబాబు నానా యాగీ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఈ వ్యవహారంతో చంద్రబాబుకి సింపతీ వచ్చే ఛాన్స్ వుందా.? ఏమో, వస్తుందేమో.. అది వేరే వ్యవహారం.
తర్వాతేంటి.? నారా లోకేష్ కూడా అరెస్టవుతారా.? ఏపీ సీఐడీ అయితే, లోకేష్ విషయంలోనూ లోతుగా విచారిస్తామని ఇప్పటికే ప్రకటించేసింది. సో, ఏ క్షణాన అయినా లోకేష్ కూడా అరెస్టయ్యే అవకాశాల్లేకపోలేదు. చంద్రబాబు అరెస్టుతోనే టీడీపీ కుదేలైపోతోంది. లోకేష్ కూడా అరెస్టయితే.. ఇక అంతే సంగతులు.
సింపతీ సంగతి దేవుడెరుగు.. అసలంటూ పార్టీనే గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చేసిందని తెలుగు తమ్ముళ్ళే అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు మరీ ఆ స్థాయికి సవాల్ విసిరి వుండకూడదన్నది అంతటా వినిపిస్తోన్న వాదన.