షాకింగ్ లుక్స్ లో రష్మిక మందన్న .. కారణమేమిటో?

కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన అంజనీపుత్ర సినిమాతో మంచి పేరుని సంపాదించుకుంది.
తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమా ఆమె కెరీర్ కే పెద్ద టర్నింగ్ పాయింట్.

ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకొని స్టార్ హోదా దక్కించుకుంది. ఆ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తర్కెక్కిన పుష్ప 1 లో శ్రీవల్లి పాత్రలో జీవించి పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం మెస్మరైజ్ చేసి ఇండియన్ క్రష్ గా పేరు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమా తో బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ కూడా తన విశ్వరూపాన్ని చూపించింది.

అయితే కొంతకాలం క్రితం వరకు మంచి ఫిజిక్ అండ్ ఫిట్నెస్ కనిపించిన రష్మిక తాజాగా కొత్త లుక్ తో మాత్రం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూసిన ప్రేక్షకులు రష్మిక ఏమిటి ఇలా అయిపోయింది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈమె రష్మిక యేనా అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ పిక్స్ లో ఆమె కొంచెం బొద్దుగా కనిపిస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.

ఏదైనా సినిమా కోసం బరువు పెరుగుతుందా లేదంటే వేరే కారణం చేత బరువు పెరిగిందా అంటూ అప్పుడే డిబేట్లు ప్రారంభించారు నెటిజన్స్. అయితే ఈ విషయంపై రష్మిక ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో పుష్ప 2 సినిమాతో పాటు తమిళ తెలుగు బై లింగువల్ చిత్రం ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ భామ.