డిసెంబర్ లో మహానటి పెళ్లి.. తెగ ఫీల్ అయిపోతున్న ఫ్యాన్స్!

కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ముందు ఇది కూడా ఎప్పటిలాగే రూమర్ అని అందరూ కొట్టి పారేశారు జనాలు కానీ ఈసారి నిజంగానే కీర్తి పెళ్లి చేసుకోబోతుంది అని క్లారిటీ వచ్చిన తర్వాత ఆమె చేసుకోబోయేది ఎవరిని అంటూ అతని బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఆ వ్యక్తి ఎవరో, ఏం చేస్తూ ఉంటాడు అనేది మనం కూడా ఓ లుక్కేద్దాం. కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త అయిన ఆంటోనీ తట్టిల్ ను గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

వీరి వివాహం డిసెంబర్ 11, 12 తేదీల్లో జరుగుతుందని, దీనికి కీర్తి ఆంటోని ల కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఇంతకీ ఎవరు ఈ ఆంటోనీ తట్టిల్ అంటే ఇతను కొచ్చి, దుబాయ్ లలో ప్రముఖ వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్ తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్ కి ప్రధాన యజమాని. కేరళ, దుబాయిలలో ఆయనకు కోట్లలో ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు.

స్కూల్ రోజుల నుంచి కీర్తి ఆంటోనీలు మంచి ఫ్రెండ్స్. వారిద్దరి 15 సంవత్సరాల ప్రేమకి ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో ఇప్పుడు పెళ్లిగా మారబోతుంది. ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేష్ కుమార్ ల ముద్దుల కూతురు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకుంది ఈ భామ.

కీర్తి సురేష్ పెళ్లి వార్త విని ఆమె ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారనే చెప్పాలి. ఇంతకుముందు స్టార్ హీరోయిన్లు గా ఉండగానే సమంత, అమలాపాల్ వంటి హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నారు, వివాహం తర్వాత కూడా వాళ్ళు సినిమాల్లో నటించినప్పటికీ మునుపటి సక్సెస్ ని అందుకోలేకపోయారు. కీర్తి సురేష్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.