ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సెన్సేషనల్ అయిన అనుష్క ఇప్పుడు సినిమాలకు దూరంగా వుంటోన్న సంగతి తెలిసిందే. బరువు సమస్య కారణంగా అనుష్క సినిమాలకు దూరమైందన్న ప్రచారం వుంది.
తాజాగా అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ అనగలమో లేదో తెలీదు కానీ, ఎప్పుడో ఒప్పుకున్న సినిమా ఇది. ఇప్పుడు పూర్తి చేస్తోంది. త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న ఈ సినిమా ప్రమోషన్లలో అనుష్క ఎప్పటిలాగే యాక్టివ్‌గా కనిపిస్తోంది. అనుష్క అంటేనే స్వీటీ. ఆ స్వీటీ మీద అభిమానం అందరికీ అలాగే వుందని చెప్పొచ్చేమో.
అనుష్క మళ్లీ సినిమాల్లో నటిస్తే చూడాలని ఆశపడుతున్న వాళ్లూ లేకపోలేరు. అనుష్క అవసరం టాలీవుడ్‌కి వుంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే అనుష్క నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రావడం లేదట. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ అయ్యాకా దాని రిజల్ట్‌ని బట్టి అనుష్క తదుపరి ప్రాజెక్టులపై డెసిషన్ తీసుకోనుందనీ తెలుస్తోంది.
రెస్పాన్స్ బావుంటే, అనుష్క మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలనుకుంటోందట. ఈ నేపథ్యంలోనే అనుష్క కోసం కొందరు మేకర్లు ఆల్రెడీ కథలు సిద్ధం చేసుకుంటున్నారనీ తెలుస్తోంది.
అలాగే, సీనియర్ హీరోల సినిమాల కోసం కూడా అనుష్క కోసం స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారట. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!