ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

PM Modi 70th Birthday

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ కారణాలతో వారి వేగానికి అడ్డు పడుతుంది. పైన ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మొత్తం వారే చేయాలి.

వారి పైన మంత్రులు ఉంటారు. ఆ శాఖలకు వారే మకుటం లేని మహారాజులుగా వ్యవహరించాలి. ఆ శాఖలు సక్రమంగా నడపడంతో పాటు వచ్చే ఐదేళ్ళ తర్వాత ఎన్నికల మీద మాత్రమే వీరి దృష్టి ఉంటుంది. ఏ నిర్ణయమైనా, వాటి అమలైనా ఎన్నికల దృష్టి కోణంలో మాత్రమే చూస్తారు. వారికి ఎన్నికలే ప్రధానం. వారు, వారి యజమాని ఇంకో ఐదేళ్ళు అధికారంలో ఉండాలి అంటే ప్రతీ నిర్ణయం రాజకీయ , ఎన్నికల దృష్టి కోణంలో మాత్రమే చూడాలని వారు నమ్ముతారు. వారి చర్యలు తదనుగుణంగానే ఉంటాయి. ఈ క్రమంలో మంత్రులకు , ప్రధానికి మధ్య నిరంతరాయంగా సమాచార పంపిణీ, సమాచార మార్పిడి జరగాలి. ఇది రాచరికం కాదు కాబట్టి ముఖ్యమంత్రి గానీ, ప్రధాన మంత్రి గానీ సమానులలో మొదటి వారుగానే ఉండాలి (First among equals). మంత్రులందరి కంటే ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఎక్కువ తెలిసినవారైనా సమానులైనా మంత్రులు అప్రమత్తతతో ఉంటారు. కేసీఆర్ , వైఎస్సార్, మన్మోహన్ సింగ్, పీవీ, వాజపేయి, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలాంటి వారు ఈ కోవలోకి వస్తారు.

ఇంకో రకమైన ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఉంటారు. వారికి పెద్దగా అనుభవం లేకపోయినా ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో అనుభవం ఉన్నవారిని మంత్రులుగా నియమించుకుని వారికి సరైన గౌరవమిస్తూ, వారి సలహాలు తీసుకుంటూ పరిపాలన కొనసాగిస్తారు. జగన్, రాజీవ్ గాంధీ లాంటివారు.

మూడో రకం ఉంటారు. మంత్రుల కంటే తక్కువ తెలిసిన వారు, తక్కువ చదువుకున్న వారు ప్రధానులు ఉంటారు. కానీ వారిలో అహంకారం ఆకాశమంత ఉంటుంది. వారి అభిమానులు, భక్తులు, ఆ పార్టీ యొక్క అబద్ధాల ప్రాపగాండా కర్మాగారం వారికి దేవుడి స్టేటస్ కల్పిస్తాయి. ఆ స్టేటస్ లో ఇంకో చదువు రాని వాడిని పక్కన పెట్టుకుని రొమ్ము విరుచుకుంటూ నడుస్తూ తనకు చాలా విషయాలు తెలియవనే నిజాన్ని మర్చిపోతుంటారు. మర్చిపోకపోయినా విషయాలు తెలుసుకోవలసిన అవసరం లేదనుకుంటారు. ఆ నడక, దేవుడి స్టేటస్ చూసి నిత్యం సంప్రదింపులు జరపాల్సిన మంత్రులు దగ్గరికి పోవడానికి కూడా భయపడతారు. ప్రధానిని కలవాలంటే పక్కన ఇంకొకడిని కలవాలి. ఇంత చదువు చదివి చదువు లేని ఆ ఇంకొకడి దగ్గరికి పోవడం ఇష్టంలేక అసలు కలవడమే మానేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు వారికి.

ఏమి తెలుసుకోవాలో తనకే తెలియని ప్రధాని మంత్రులతో ఏమి మాట్లాడతాడు? అందుకని సంప్రదింపులు ఏమీ జరగవు. సంప్రదింపులు జరిపితే ఎక్కడ అజ్ఞానం బయటపడిపోతుందనే భయం కూడా ఉంటుంది. అందుకే పంపిణీ, మార్పిడి జరగాల్సిన అతి ముఖ్య సమాచారం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ముడ్డి కిందకి మంట వచ్చేదాకా మరుసటి రోజు వేసుకోవలసిన నాలుగు జతల కొత్త బట్టల మీదే ధ్యాస అంతా ఉంటుంది. మంట వచ్చాక అరకొర సమాచారం తీసుకుని అప్పుడు టీవీల ముందుకు వస్తారు.

Ravikanth Reddy M