ఆమరణ దీక్షలు మళ్లీ మొదలవుతున్నాయా?

(శివ రాచర్ల)

కడప ఉక్కు పరిశ్రమ కోసం అధికార తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎమ్ రమేష్ మరియు, ఎమ్మెల్సి, బిటెక్ రవి నిరహార దీక్ష చేసి కేంద్రం స్పందిచకపోవటం మరియు ఆరోగ్యం క్షీణించటంతో దీక్ష విరమించటం తెలిసిందే.ఈ సందర్భంల్పో చరిత్రలో జరిగిన కొన్ని అమరులైన నిరాహారదీక్షల వివరాలు ఇక్కడ రాస్తున్నాను.

I request friends not to comment on CM Ramesh hunger strike and to respond only on written data and its related information.

సిఎం రమేష్ ను, తెలుగుదేశాన్ని విమర్శించటం వలన ఇక్కడ రాసిన అమరుల త్యాగాన్ని చిన్నబుచ్చటం నాకు ఇష్టం లేదు.

కింది అంశాలు చూద్దాం ,

1.నిరాహార దీక్షలో అమరుడైన తోలి నాయకుడు ఎవరు?

2.పొట్టి శ్రీరాములు దీక్ష వలన ఆంద్ర రాష్ట్రం ఏర్పడితే మరి ఎవరి దీక్ష వలన మద్రాస్ రాష్ట్రం పేరు తమిళనాడుగా మారింది?

  1. ఈమధ్య కాలంలో అమరులైన దీక్షలు

1).జతింద్రనాథ్ దాస్

1904లో పుట్టిన జతింద్రనాథ్ దాస్ “అనుశీలన్ సమితి” అనే బెంగాల్ రహస్య విప్లవ గ్రూపులో చేరి భారత్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.

1925లో బిఏ చదివే సమయంలొ జతింద్రనాథ్ వివ్లవ కార్యక్రమాల ముమ్మరంగా నిర్వహించారు.ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.జైలు అధికారులు రాజకీయ ఖైదీల పట్ల అణిచివేత ధోరణిని వ్యతిరేకిస్తు 20 రోజులపాటు నిరహార దీక్ష చేశారు.చివరికి జైలు సూపర్నిడెంట్ క్షమాపణ చెప్పటంతో జతింద్రనాథ్ దీక్ష విరమించారు. సచింద్ర సన్యాల్ వద్ద బాంబుల తయారి నేర్చుకున్న జతింద్రనాథ్ కు సచింద్ర సన్యాల్ ద్వారా భగత్ సింగ్ తదితర ఇతర విప్లవ వర్గాలతో పరిచయాలు ఏర్పడ్డాయి.

 

1928లో సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా “లాలా లజపతి రాయ్” నాయకత్వంలో లాహోరులో జరిగిన ప్రదర్శన మీద జరిపిన లాఠీచార్జిలో గాయపడిన లజపతిరాయ్ ఆ దెబ్బల నుంచి కోలుకోక నెల లోపలే నవంబర్  27, 1928 న చనిపోయారు. లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా భగత్ సింగ్ మరియు ఆయన మిత్రులు బ్రిటీష్ పోలీస్అధికారి సౌండర్స్ ను 17-Dec-1928న కాల్చి చంపారు.తమ పోరాటాన్ని అందరికి తెలియ చెప్పే ఉద్దేశ్యంతో భగత్ సింగ్ మరియు భటుకేస్వర్ దత్ 8-Apr-1929న డిల్లి అసెంబ్లీలో రెండు పొగ బాంబులు విసిరి “ఇంకిలాబ్ జిందాబాద్” అంటూ నినాదాలు ఇస్తూ కరపత్రాలు వెదజల్లారు. తప్పించుకోకుండా పోలీసులకు దొరికి కోర్టులో తమ రాజకీయ పంథాను చెప్పటం ద్వారా దేశం మొత్తం ప్రచారం కల్పించాలన్న లక్షంతో భగత్ సింగ్ పోలీసులకు దొరికిపోయారు.

ఈ సంఘటన తరువాత పోలీసులు లాహోర్ నగరాన్ని జల్లెడ పట్టి బాంబులు తయారు చేస్తున్న ఇంటిని స్వాదీనం చేసుకున్నారు.ఈ మొత్తం కేసు “లాహోర్ కుట్ర కేసు”గా ప్రసిద్ది చెందినది. ఈ కేసులో జతీంద్ర నాథ్ను బాంబుల తయారి చేసినందుకు అరెస్ట్ చేసి లాహోర్ జైల్లో ఉంచారు.

లాహోర్ జైల్లొ రాజకీయ ఖైదీల పట్ల అధికారులు అనుసరించిన దుర్మార్గ వైఖరికి నిరసనగా భగత్ లాహోర్ కుట్ర కేసులో నిందితులు నిరహార దీక్ష చేశారు.వీరిలో కొందరు మధ్యలో దీక్ష విరమించగా జతీంద్రనాథ్ మాత్రం జూలై 13, 1929 నుంచి 63 రోజుల పాటు నిరహార దీక్ష చేసి 13-Sep-1929న 25 సంవత్సరాల వయస్సులోమరణించారు.నిరహార దీక్ష చేస్తు మరణించిన తొలి వ్యక్తి,విప్లవకారుడు,నాయకుడు జతింద్రనాథ్ దాస్.

 

2). పొట్టిశ్రీరాములు

జతింద్రనాథ్ తరువాత చెప్పుకోవలసింది పొట్టిశ్రీరాములు ఆమరణ దీక్ష గురించి.ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలొని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని నిరహార దీక్ష చేసిన శ్రీరాములు గారు అక్టోబర్  19, 1952 నుంచి 57 రోజులపాటు నిరహార దీక్ష చేసి 15-Dec-1952న అమరులయ్యారు,01-Oct-1953 న కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.ఈ విషయాల చాలాసార్లు రాశాను,ఈపోస్టులో ఎక్కువ వివరాలు రాయటం లేదు.

 

3). శంకరలింగనార్

శంకరలింగనార్

1956లో మొదటి రాష్ట్ర పునః విభజన కమిటి(SRC) ప్రతిపాదించిన భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నవంబర్ 01, 1956న ఆంధ్రా,హైద్రాబాద్ కలిసి ఆంధ్రప్రదేశ్ ,మైసూర్ మరియు మద్రాస్ రాష్ట్రలో ఉన్న కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలిసి కర్ణాటక ఏర్పడగా,వీటికన్నా ఒక్కరోజు ముందు అక్టోబర్  31, 1956 న కేరళా ఏర్పడింది.

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు,కన్నడ మరియు మలయాళ ప్రాంతాలువిడదీసి భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుండటంతో మిగిలిన మద్రాస్ రాష్ట్రానికి “తమిళనాడు” పేరు పెట్టాలని చాలా ఉద్యమాలు జరిగాయి. తమిళనాడు పేరు కోసం కమ్యునిస్ట్ పార్టి సభ్యుడు శంకరలింగనార్ జూలై 27, 1956 న నిరాహార దీక్ష ప్రారంభించి 76 వ రోజున హాస్పటల్లొ చనిపోయారు.తమిళనాడు పేరు కోసం 1957లో అసెంబ్లీలో DMK ప్రవేశపెట్టిన బిల్లు కాంగ్రేస్ వ్యతిరేకించటంతో వీగిపోయింది.చివరికి 1967 ఎన్నికల్లొ DMK ఎన్నికల్లొ గెలిచి అన్నాదురై ముఖ్యమంత్రి అయిన తరువాత 1968లో మద్రాస్ రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు.ఆ విధంగా పొట్టి శ్రీరాములు,శంకరలింగానార్ అమరులైన తరువాత వారి లక్ష్యం నెరవేరింది. గత దశాబ్ధంలో అమరులైన 2 నిరహారదీక్షలు జరిగాయి.

4). నిగమానంద సరస్వతి

Swami Nigmananda

2011లో గంగా నదిని అక్రమ మైనింగును మరియు కాలుష్యం భారి నుంచి కాపాడాలని ఉత్తరాఖండులో స్వామి “నిగమానంద్ సరస్వతి” ఫిబ్రవరి 19-2011న నిరహార దీక్ష మొదలు పెట్టారు.దీక్ష మొదలు పెట్టిన 68 వ రోజు అంటే ఏప్రిల్  27, 2011న పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి హాస్పటల్లొ చేర్చారు. అయినా కాని నిగమానంద హాస్పటల్లోనే నిరహారదీక్షను కొనసాగించారు. హాస్పటల్లొ ఒక అనుమానాస్పద వ్యక్తి నిగమానందకు ఇంజెంక్షన్ ద్వారా విషాన్ని ఎక్కించారని ఆరోపణలు వొచ్చాయి.చివరికి డీహైడ్రేషన్ వలన దీక్ష మొదలు పెట్టిన 115 వరోజు జూన్ 13, 2011న నిగమానంద సరస్వతి మరణించారు.

5). గురుశరణ్ చాబ్రా

రాజస్థాన్ మాజి MLA(జనతాపార్టి) గురుశరణ్ చాబ్రా మద్యపాన మరియు పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని పలుమార్లు నిరాహారదీక్షచేసారు. చాబ్రా తన చివరి నిరాహారదీక్షను 2014 గాంధి జయంతి రోజున (i.e.అక్టోబర్ 02, 2014)న మొదలు పెట్టారు.10 రోజుల తరువాత 13-Oct-2014న చాబ్రా కోమాలోకి వెళ్ళారు ,పోలీసులు ఆయన్ను హాస్పటలుకు తరలించగా దీక్ష మొదలుపెట్టిన 32వ రోజు నవంబర్ 03,2014న కోమాలోనే మరణించారు.

చివరి రెండు త్యాగాల ఫలితాలు దక్కలేదు.ఆతరువాత ఎవరు నిరాహారదీక్షలో మరణించినట్లు లేరు.దీక్షలకు ప్రభుత్వాలు దిగి వొచ్చే పరిస్థితి లేదు,అనేక సందర్భాలలో తాము అధికారంలో ఉండగా ఉద్యమాలను,నిరహార దీక్షలను పట్టించుకోని పార్టీలు అధికారం కోల్పోయిన తరువాత దీక్షలకు దిగటం చిత్రంగానే ఉంటుంది.ఇప్పుడు పొత్తులు తెగిన తరువాత రాష్ట్ర అధికార పార్టీలు కూడా దీక్షలకు దిగటం కొత్త పోకడ,.

(ఫేస్ బుక్ నుంచి)