Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మార్క్ నిరూపించుకోవడం కోసం సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన అధికారంలోకి రావడంతోనే వాహనాల రిజిస్ట్రేషన్ పై టీఎస్ ఉన్నది కాస్త టీజీగా మార్చారు. ఇక ఇటీవల సచివాలయంలో కొత్త రూపురేకులతో తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇలా రేవంత్ తన మార్కును పెంపొందించుకోవడం కోసం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో ఏపీ సీఎం చంద్రబాబు సైతం షాక్ లో ఉండిపోయారు. మరి రేవంత్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే.. తెలంగాణలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును కూడా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా పొట్టి శ్రీరాములు పేరును తొలగించి ఈ యూనివర్సిటీకి తెలంగాణ వైతాళికుడిగా పేరున్న సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతామని సీఎం రేవంత్ ప్రకటన చేశారు.
ఇలా పొట్టి శ్రీరాములు పేరును ఆ యూనివర్సిటీకి తొలగించడం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తనకు బాధ కలిగించిందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు.
ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కనీవినీ ఎరుగని రీతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును పెడతామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన తర్వాతనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎగసిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం పొట్టి శ్రీరాములు పేరు స్థాయిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.