విష్ణుమూర్తి శనీశ్వరుని అనుగ్రహం మనపై ఉండాలంటే.. ఈ మొక్క ఇంట్లో ఉండాల్సిందే?

సాధారణంగా మన హిందూ పురాణాల ప్రకారం కొన్ని మొక్కలను ఎంతో పవిత్రమైనవి, ఆధ్యాత్మికమైనవిగా భావిస్తుంటాము. ఈ క్రమంలోనే కొన్ని రకాల మొక్కలకు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే ఇప్పటికే కొందరి ఇంటి ఆవరణంలో తులసి పారిజాతం బిల్వపత్రి వంటి మొదలైన మొక్కలు ఉంటాయి. అయితే విష్ణుమూర్తికి శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి అపరాజిత మొక్క ఇంట్లో ఉండటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి.

విష్ణుమూర్తికి శనీశ్వరునికి అపరాజిత పుష్పాలతో పూజ చేయటం వల్ల వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఈ పూల మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక అభివృద్ధి సంతోషం శ్రేయస్సు వంటి వాటికి ఏమాత్రం కొదువ ఉండదు. ఎంతో పవిత్రమైన ఈ అపరాజిత మొక్కను ఇంట్లో ఉత్తరం దిశలో నాటడం ఎంతో మంచిది.పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు ఇలా నాటడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక అపరాజిత పుష్పాలతో ప్రతి సోమవారం, శనివారం మూడు పుష్పాలను తీసుకుని నీటిలో వేయాలి.ఇలా మూడు వారాలు పాటు చేయడం వల్ల మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ పుష్పాలను శనీశ్వరునికి సమర్పించడం వల్ల శని దోషం నుంచి విముక్తి పొందవచ్చు. ఈ విధంగా అపరాజిత మొక్క ఇంటి ఆవరణంలో ఉండడం ఎంతో శుభ పరిణామం.