Aamir Khan – Gauri Spratt: ఆమిర్ ఖాన్ లవ్ స్టోరీ.. గౌరీ మాటలు వైరల్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆయన, స్నేహితురాలు గౌరీ స్ప్రత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. బెంగళూరుకు చెందిన గౌరీ, ఆమిర్ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేస్తుందని చెప్పారు. ఇంతకాలం వారి స్నేహం గురించి పెద్దగా మాట్లాడని ఆమిర్, గడిచిన సంవత్సరం నుంచీ ఆమెతో రిలేషన్‌లో ఉన్నట్టు స్వయంగా చెప్పడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆమిర్ ప్రకటనతో నెటిజన్లు గౌరీ గురించి తెగ గూగుల్‌లో వెతికారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ జంట విలేకరులతో మరోసారి ముఖాముఖి అయ్యింది. ప్రత్యేకంగా గౌరీ స్పందిస్తూ, “నాకు ఓ మంచి మనసున్న వ్యక్తి, అండగా నిలిచే వ్యక్తి కావాలి. ఆ లక్షణాలను ఆమిర్‌లో చూసాను” అని చెప్పారు. ఇక ఆమిర్ కూడా తన వైపు నుంచి స్పందిస్తూ, “నా జీవితంలో ప్రశాంతతను ఇచ్చే వ్యక్తిని కోరుకున్నాను. గౌరీతో ఉన్నప్పుడు అలాంటి ఫీల్ వస్తోంది” అని వెల్లడించారు.

ఈ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ లోపల, బయట కూడా వీరి సంబంధంపై అనేక రకాలుగా స్పందనలు వస్తున్నాయి. ఒకవైపు అభిమానులు శుభాకాంక్షలు చెబుతుంటే, మరికొందరు ఇది నిజంగా పెళ్లికి దారితీస్తుందా లేదా మరో సంబంధం మాదిరిగా ముగుస్తుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన ఆమిర్ ఖాన్, మళ్లీ ప్రేమలో పడటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అయితే గౌరీ గతంలో వివాహిత అని, ఆమెకు 6 ఏళ్ల కూతురు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు గౌరీ కానీ, ఆమిర్ కానీ స్పందించలేదు. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే, ఈ బంధం మరింత గట్టిపడేలా ఉందని భావిస్తున్నారు. వారి ఫోటోలు, ఇంటర్వ్యూలు చూసిన అభిమానులు “ఇది నిజమైన లవ్ స్టోరీ” అని వ్యాఖ్యానిస్తున్నారు.