షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచే మొక్క…రోజుకు రెండు ఆకులు చాలు!

Diabetes-treatment-1200x675

మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మొక్కల్లో మధుపత్రి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి జాతికి చెందిన ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మధుపత్రి మొక్కను శాస్త్రీయంగా స్టివియా అని వ్యవహరిస్తారు. మధుపత్రి ఆకులు పేరుకు తగ్గట్టుగానే చక్కర కంటే 35 రెట్లు ఎక్కువ తీయదనాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఈ మొక్క ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్, యాంటీ అలర్జిటిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.

డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు తియ్యని ఆహార పదార్థాలను తినాలని ఉన్న తినలేని పరిస్థితి అలాంటి వారికి మధుపత్రి మొక్క ఆకులు గొప్ప వరంగా భావించవచ్చు. అత్యంత మధురంగా ఉండే మధుపత్రి ఆకులను సహజ చక్కర పదార్ధంగా ఉపయోగించవచ్చు. ఈ మొక్క ఆకులను పొడిగా తయారు చేసుకొని రోజువారి ఆహారంలో వినియోగిస్తే డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉంచడమే కాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది.

మధుపత్రి మొక్క ఆకుల్లో గుండె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు నోటి దుర్వాసనను, చిగుళ్ల సమస్యను తొలగిస్తాయి కావున ఈ మొక్క ఆకులను నమిలి మింగితే నోరు రోజంతా తాజాగా ఉంటుంది. మరియు ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు శరీరంలో వ్యాధి కారకాలను నియంత్రించి క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. జీర్ణ సంబంధిత వ్యాధులైన మలబద్దకం అజీర్తి గ్యాస్ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. మధుపత్రి మొక్క ఆకుల్లో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి ఉబకాయం, రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రణలో ఉంచుతుంది.

మధుపత్రి మొక్క ఆకులు కొందరిలో అలర్జీ సమస్యలకు కారణం కావచ్చు కావున ఈ మొక్క ఉత్పత్తులను వినియోగించే ముందు ఆయుర్వేద నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది