KTR: రేవంత్ నీ అక్రమ సంబంధాలు బయటపెట్టాలా… ముఖ్యమంత్రి పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నేడు మీడియా చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ మాట్లాడారు. ఇప్పుడు మీ గురించి మాట్లాడితేనే కుటుంబ విలువలు గుర్తొచ్చాయా మరి అడ్డమైన వారితో మాకు లింకులు పెట్టినప్పుడు నీకు ఇలాంటి కుటుంబ విలువలు గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ రేస్ విషయంలో పెద్ద ఎత్తున విచారణకు ఆదేశాలను జారీ చేశారు అయితే ఇప్పుడు ఏకపక్షంగా మీరు విచారణను నిలిపివేసిన తాను మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.

తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఫార్ములా-ఈ రేస్ ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కచ్చితంగా విచారణ ఉంటుందని ఈయన తెలిపారు.రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ ఎంతో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు.

కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. ఇలా పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వాన్ని అలాగే బీజేపీని ఉద్దేశించి ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటో తెలియాల్సి ఉంది.