శని దోషం ఉన్నవారు శనీశ్వరుడిని ఇలా పూజిస్తే చాలు దోషం తొలగిపోతుంది..?

మన హిందూ సంప్రదాయంలో పూజలకు చాలా ప్రత్యేకత ఉంది. దేశంలోని ప్రజలందరూ ప్రతిరోజు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అయితే శని దేవుడిని పూజించటానికి ప్రజలు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శని దేవుని పూజించడం వల్ల శని దోషం కలుగుతుందని ప్రజలు భయపడుతూ ఉంటారు. అయితే నిజానికి మన జాతకంలోని గ్రహాల వల్ల శని దోషం ఉంటుంది. ఈ శని దోషం తొలగించటానికి శని దేవుని పూజించటం చాలా అవసరం. శని దేవుని పూజించడం వల్ల మన జాతకంలో ఉన్న దోషం తొలగిపోవడమే కాకుండా శని దేవుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. శని దోషం తొలగిపోవడానికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జాతకంలో శని దోషం ఉండటం వల్ల మనం చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతూ ఆ పనులలో విజయం సాధించలేము. ఇలా ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించి ఆలయానికి వెళ్లి శని దేవుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మన జాతకంలో ఉన్న శని దోషం తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయి. శని దేవుడి ఆలయానికి వెళ్ళలేని వారు స్థానికంగా ఉన్న ఆలయంలోని నవగ్రహాల వద్దకు వెళ్లి ఇలా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది.

శని దోష ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారు నువ్వుల నూనెతో దీపం వెలిగించడమే కాకుండా శని దేవుడికి ఇష్టమైన బెల్లం తో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అంతే కాకుండా నల్లటి వస్త్రంలో నల్లని నువ్వులను మూటకట్టి ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. అలాగే నవగ్రహాల చుట్టూ 9 ప్రదీక్షనలు చేసి కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని శివాలయం లేదా ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే శని దోషం తొలగిపోతుంది. శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం రోజున ఇలా చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషం తొలగిపోయి శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.