AP: ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలో అధికారంలో ఉన్నాయి 2019 ఎన్నికలలో వైసీపీ సునామీలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమవుతూ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈసారి బిజెపితోను అలాగే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చి అద్భుతమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి దాదాపు పది నెలలు అవుతుంది.
ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా కూటమి పార్టీలో ప్రకటించిన సూపర్ సిక్స్ బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ఓటమికి గల కారణాలను వివరించారు. 2019 ఎన్నికలలోను అదేవిధంగా 2004 ఎన్నికలలో తాను ఓడిపోవడానికి గల కారణాలను బయటపెట్టారు.
2004, 2019 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి కారణం మరెవరో కాదని నేనే నా ఓటమికి కారణమని చంద్రబాబు నాయుడు తెలిపారు.కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో పీ4 విధానం అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం అన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజక వర్గం, మున్సిపాలిటీ, మండలాలు వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమైందని పేర్కొన్నారు. సచివాలయం యూనిట్ గా తీసుకుని ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక 2029 ఎన్నికలకు ముందు మనం ఏం చేశాము తదుపరి ఏం చేస్తామో చెబుతూ ఎన్నికలకు వెళ్తామని ఈయన వెల్లడించారు.