నవంబర్ 29న అరుణాచలంలో కార్తీకదీపోత్సవం !

karthikadipotsavam in arunachalam temple on 29th november

కొండలు…గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం… అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం కార్తీక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

karthikadipotsavam in arunachalam temple on 29th november
karthikadipotsavam in arunachalam temple on 29th november

వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వర పురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో

భరణీ దీపం

కార్తీక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. తమిళులకు కార్తీక మాసము, కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరిపైన మహా జ్యోతిని ప్రజ్వలింపజేస్తారు. దీనినే ” కృత్తికా దీపోత్సవం ” అంటారు.

కార్తీక దీపోత్సవ విశేషాలు

ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద ఇలా రాగితో చేయబడుతుంది. ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం 600 మీటర్లతో చేయబడుతుంది. ఈ ప్రమిదను, వత్తిని ” జ్యోతి నాడార్ లేక దీప నాడార్ ” అని పిలువబడే వంశస్తులు మాత్రమే అందజేస్తారు. ఇక 2500 కిలోల నెయ్యి అరుణాచలానికీ వచ్చే భక్తులు అందజేస్తారు. అలా వెలిగించిన అరుణాచల మహా దీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది. సుమారు 24 కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది. వీలైతే అరుణాచలం వెళ్లి ప్రత్యక్షంగా జ్యోతిని దర్శించు కోవడం అత్యంత పుణ్యప్రదం. ఈ జ్యోతిని దర్శించేందుకు దేశ విదేశాలలో ఉండే భక్తులు కూడా అరుణాచలం చేరుకుంటారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం విచ్చేస్తుంటారు. గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ ” అరుణాచలం ” అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ, ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మరాజు ప్రశ్నిస్తాడటా. ఒకవేళ వారి పుణ్యం కొలదీ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, వారి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తరువాతగా విభజించి, గిరి ప్రదక్షిణకు ముందు చేసిన పాపం రాశులను లెక్కించరని అరుణాచల క్షేత్ర మహత్యంలో ఉన్నది.
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది.

యుగయుగాలలో అరుణగిరి

కృతయుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు. ఈ పవిత్రమైన కార్తీక మహాదీపం లేదా భరణీ దీప ఉత్సవం నవంబర్‌ 29న నిర్వహించనున్నారు.