సాధారణంగా దేవుడంటే ప్రతిఒక్కరికీ భక్తి శ్రద్ధలు ఉంటాయి. అందరి దేవుళ్ళను ప్రతి రోజూ ఎంతో భక్తితో పూజిస్తారు. కానీ శని దేవుడంటే మాత్రం అందరికీ భయం పుడుతుంది. ఎందుకంటె శని దృష్టి మనపై పడితే తీవ్ర స్థాయిలో సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల అందరికీ శని దేవుడంటే భక్తికన్నా భయం ఎక్కువ. శనిగ్రహం ప్రభావం వల్ల శారీరక, మానసిక సమస్యలతో సతమవుతారు. అంతే కాకుండా మనిషి కష్టపడి పనిచేసినప్పటికీ, అతనికి విజయం లభించదు. అయితే ఇలా శని దోషం వల్ల ఇబ్బంది పడుతున్న వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
జ్యోతిష శాస్త్రంలో, గ్రహ దోషాలను తొలగించడానికి అనేక నివారణలు,పరిహారాలు పేర్కొనబడ్డాయి. నియమాలు పాటిస్తూ పరిహారాలు అనుసరించడం ద్వారా ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.
శని దోషం వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారు ఒక నల్ల గుడ్డలో 11 రూపాయలు, కొన్ని మిరియాలు కట్టి శనిదేవుని ఆలయానికి వెళ్లి అక్కడ శని దేవుడి పాదాల వద్ద వాటిని ఉంచి తర్వాత ఇతరులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని దోషం తొలగిపోతుంది. శని దోష ప్రభావం తొలగిపోవడమే కాకుండా చేపట్టిన అన్ని పనిలలో విజయం సాధిస్తారు.
అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు 5 మిరియాలను తీసుకొని తలపై 7 సార్లు చుట్టి, రాత్రిపూట నిశ్శబ్ద ప్రదేశంలో లేదా చతురస్రాకారంలో నాలుగు వేర్వేరు దిశల్లో ఒక్కో గింజ వేయాలి. చివరి గింజ ని ఆకాశం వైపు విసిరి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేవారు మిరియాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచి బయటకు వెళ్లేటప్పుడు మొదటి అడుగు మిరియాల మీద పెట్టి బయటకు వెళ్లాలి. ఇలా చేయడం వల్ల చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.