శని దోషం తొలగించి సిరిసంపదలను కలిగించే మొక్క.. ఇంట్లో ఏ దిక్కున నాటాలో తెలుసా..?

shami1

సాధారణంగా మన హిందూ సంస్కృతిలో దేవుళ్ళతోపాటు కొన్ని రకాల మొక్కలను కూడా పూజిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన ఆ మొక్కలను ఇంట్లో పెంచి పూజించడం వల్లే అనేక శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజింపబడే మొక్కలలో శమీ మొక్క కూడా ఒకటి. ఈ మొక్కని ఇంట్లో నాటడం వల్ల ఆ ఇంట్లో సానుకూల ప్రభావం ఉంటుంది. అలాగే ఆ దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శమీ మొక్క ఇంట్లోని అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది. అయితే ఈ మొక్కను ఇంట్లో సరైన దిశలో సరైన స్థలంలో నాటడం చాలా ముఖ్యం. ఈ మొక్కను ఇంట్లో
ఏ దిక్కున నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శనికి సంబంధించినది కాబట్టి ఈ మొక్కకు శమీ అని పేరు వచ్చింది. మీ ఇంట్లో సరైన స్థలంలో శమీ మొక్క ఉంటే, మీకు శనిదేవుని అనుగ్రహం ఆశీస్సులు కూడా లభిస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తూర్పు దిశలో శమీ మొక్కను నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఈ మొక్కను దక్షిణ దిశలో కూడా నాటవచ్చు. అయితే ఇంటి ముందు మొక్క నాటడానికి వీలు లేని వారు ఇంటి పైకప్పు మీద కూడా ఈ మొక్క నాటడం శుభప్రదం. ముఖ్యంగా శమీ మొక్కను నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. లేదంటే శనిదేవుడు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది.

శమీ మొక్క నాటడానికి వారంలో ఏ రోజు అయిన మంచిదే. కాకపోతే శని దేవుడికి ఇష్టమైన శనివారము రోజు ఈ మొక్క నాటడం మంచిది. ఇంట్లో శమీ మొక్క ఉంటే ప్రతి శనివారం పూజ చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అందువల్ల శని ప్రభావం వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారు ప్రతి శనివారం రోజున ఈ మొక్క ముందు దీపం వెలిగించి పూజించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో పురోభివృద్ధి, సంతోషం కూడా కలుగుతాయి. అలాగే శమీ మొక్క చుట్టూ ఎప్పుడూ చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి.