భద్రకాల సమయంలో హోళికా దహనం.. పూజా నియమాలు,సమయం గురించి పూర్తి వివరాలు..?

మన హిందూ సంప్రదాయంలో పండగలకు చాలా విశిష్టత ఉంది. ప్రజలందరూ ఎన్నో పండుగలను ఎంతో ఆనందంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అలా హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ పండుగ కూడా ఒకటి. వసంత కాలంలో పాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ హోలీ పండుగను దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగని హోలీ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగ రోజున ప్రజలందరూ ఎంతో ఉల్లాసంగా ఆనందంగా రంగులు చల్లుకుంటూ పండుగని జరుపుకుంటారు.

 

ఈ సంవత్సరం 07 ఫిబ్రవరి 2023 న హోలీ పండుగ జరుపుకుంటారు. హిందువుల విశ్వాసం ప్రకారం.. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ అని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే హోలికా దహనాన్ని నిర్వహించడానికి, మన గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన నియమాలు పేర్కొనబడ్డాయి. హోలికా దహనం.. ఆరాధన విధానం, శుభ సమయం.. దానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

పంచాంగం ప్రకారం.. మార్చి 07, 2023, మంగళవారం నాడు హోలికా దహనం నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫాల్గుణ మాసం మార్చి 06, 2023న సాయంత్రం 04:17 గంటలకు పౌర్ణమి ప్రారంభం అయ్యి మరుసటి రోజు మార్చి 07, 2023 సాయంత్రం 06:09 వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం భద్రుని నీడ కూడా హోలికా దహనం రోజున ఉంటుంది. అయితే అది ఫిబ్రవరి 07, 2023 ఉదయం 05:15 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం హోలికా దహన్‌కు అత్యంత అనుకూలమైన సమయం సాయంత్రం 06:24 నుండి రాత్రి 08:51 వరకు ఉంటుంది.

 

హోలికా దహనం పూజ విధానం :

 

మార్చి 7వ తేదీ సాయంత్రం 06:24 నుండి రాత్రి 08:51 శుభ సమయంలో హోలికా దహనం చేసే అగ్ని ని వెలిగించాలి. ఇక హోలీ పూజలో ఎండు కొబ్బరి, గోధుమలు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఈ పూజలో ఆవు పేడతో చేసిన వస్తువులు, కొద్దిగా పసుపు, ఆవాలు, పువ్వులు, రంగులు మొదలైన వాటిని పూజలో సమర్పించాలి. హోళికను పూజించిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇక ఆ తరువాత హోలికను దహనం చేసే ముందు శరీరంపై ఉబ్తాన్ పూయడం ఆచారం. ఇక హోలికదహనం చింతచెట్టు, ఆవు పేడతో చేసిన పిడకలు మొదలైన వాటిని ఉపయోగిస్తారు. అలాగే హోలిక దహనం చేసేవ్యక్తి నల్లటి వస్త్రాలు ధరించాలి.

అయితే ఎవరైనా స్త్రీ హోలీకా దహనం చేస్తే వారి తలను వస్త్రంతో కప్పుకుని హోలికను పూజించి దహించలి. అలాగే హోలికా దహన్ రాత్రి ఏ నిర్జన ప్రదేశానికి వెళ్లకుండా చూసుకోవాలి.