హోలీ పండుగ రోజు ఈ వస్తువులు కొంటే ఇక అదృష్టం ఇంట్లో తాండవం చేస్తుంది!

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ హోలీ పండుగ ఈ ఏడాది మార్చి ఏడవ తేదీ వస్తుంది.మార్చ్ ఏడవ తేది హోళికా దహనం జరిగిన తర్వాత మరుసటి రోజు ప్రతి ఒక్కరు హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా హోలీ పండుగ రోజున తప్పనిసరిగా కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయటం వల్ల అదృష్టం మన ఇంట్లో తాండవం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరి హోలీ పండుగ రోజు ఏ వస్తువులను కొనాలి అనే విషయానికి వస్తే…

హోలీ పండుగ రోజు కొనుగోలు చేయాల్సిన వాటిలో వెండి నాణెం ఒకటి. వెండి నాణెం, చిన్న పెట్టె కొంటే పసుపుతో పసుపు గుడ్డలో కట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవాలని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. హోళిక దహనం తర్వాత ఆ బూడిదను వెండి పెట్టెలో పెట్టి మనం డబ్బు దాచే చోటా పెట్టడం వల్ల సంపదకు ఏమాత్రం లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఇక హోలికా దహనం రోజున, వెండి ఉంగరాన్ని కొనుగోలు చేసి, దానిని పూజించాలి. దీని తర్వాత మీ వేలిలో ధరించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీపై ఉంటాయి.

ఈ విధంగా హోలీ రోజున కొనుగోలు చేసిన వెండి ఉంగరాన్ని తెచ్చిన వెంటనే పాలతో శుభ్రం చేసి అనంతరం ధరించాలి. వివాహమైన స్త్రీలు హోలీ రోజున వెండి రేకులు కొనడం చాలా శుభప్రదమని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. హోలీ రోజున ఒక వెండి రేకును కొని ఇంటికి తెచ్చి, పాలతో కడిగి ఆ వెండి రేఖను వివాహిత స్త్రీలకు ఇవ్వడం ఎంతో మంచిది. ఇలా హోలీ పండుగ రోజు ఈ వస్తువులు కనుక కొనుగోలు చేస్తే అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుందని పండితులు చెబుతున్నారు.