హోలీ పండుగ ఎలా వచ్చింది? ఈ పండుగ జరుపుకోవడం వెనుక కారణం ఏంటో తెలుసా?

భారతీయులు ఎంతో ఆనందంగా సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి ఈ పండుగ ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరుపుకుంటారు.ఇలా ఈ పండుగ రోజు కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరికీ ఒకే చోట చేరి సంతోషంగా రంగులు చల్లుకుంటూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు హాలికా దహనాన్ని కూడా చేస్తారు. అసలు హోలీ పండుగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి ఈ పండుగ రోజు హోలీక దహనం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే…

పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేసి తనను చంపడం అసాధ్యమయ్యేలా వరాన్ని కోరుకుంటారు. ఇలా తనని ఎవరు చంపలేకపోవడంతో ఆయన అహంకారం రోజురోజుకు పెరిగిపోతుంది కానీ హిరణ్యకశిపుడికి జన్మించిన ప్రహ్లాదుడు మాత్రం ఇందుకు చాలా విరుద్ధం. ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీమహావిష్ణువును పూజించేవారు. ఇలా తన కొడుకు తనకు విరుద్ధంగా ఉండడంతో ప్రహ్లాదుడిని చంపేయాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

ఇలా హిరణ్యకశిపుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడిని చంపడం తన వల్ల కాలేదు. ఈ ప్రయత్నాలలో భాగంగా హిరణ్యకశిపుడు తన చెల్లెలు హాలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ప్రహ్లాదుడిని ఆజ్ఞాపిస్తాడు. అయితే హోలిక కప్పుకున్న బట్టలు తొలగిపోయి ప్రహ్లాదుడిని రక్షిస్తాయి. చెడు ఆలోచన చేయడం వలన హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. దీంతో హోలిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కశిపుడుని సంహరిస్తాడు.