భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కూడా

భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పక్కింటి ఆయనతో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు భర్త ప్రాణాలు పోయాయి. క్షణికావేశంలో చేసిన తప్పుకు మూడు జీవితాలు ఆగమయ్యాయి. అసలీ సంఘటన ఎక్కడ జరిగింది, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

గుంటూరు జిల్లా పొన్నూరుకి చెందిన శ్రీనివాసరావు ఆర్టీసీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతను ఎక్కువగా నైట్ డ్యూటిలకు వెళుతుంటాడు. కొంత కాలం కిందట అతనికి వట్టిచెరుకూరులోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా శ్రీనివాసరావు భార్య పార్వతికి తెలిసింది. పలుసార్లు నిలదీయగా అతను పట్టించుకోనట్టు వ్యవహరించడంతో వారిద్దరికి గొడవలు అయ్యాయి. రాను రాను పార్వతిని పట్టించుకోవడాన్ని శ్రీనివాసరావు మానేశాడు.

ఇంతలోనే పార్వతికి వారింటి పక్కకు ఉన్న కారు డ్రైవర్ ఆకుల నరేష్ తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన శ్రీనివాసరావు నరేష్ కు తన స్నేహితులతో వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి నువ్వు వివాహేతర సంబంధం పెట్టుకుంటే తప్పులేదు కానీ తాను  పెట్టుకుంటే తప్పేముందని భర్తను ప్రశ్నించింది.

దీనిని అవమానంగా భావించిన నరేష్ శ్రీనివాసరావును అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేశాడు. తన స్నేహితులైన మరికొంత మంది కారు డ్రైవర్లకు విషయం చెప్పి దసరా రోజు శ్రీనివాసరావు ఉదయం 4 గంటలకు డ్యూటికి వెళుతుండగా వారి కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద లైట్లు ఆపివేసి ఇనుపరాడ్డుతో శ్రీనివాసరావు తలపై కొట్టి హత్య చేశారు. దాంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయాడు.  

అప్పటికే ఈ విషయమంతా కాలనీ వాసులకు తెలియడంతో వారు నరేష్ పై అనుమానం వ్యక్తం చేశారు. తానే చంపానని నరేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. శ్రీనివాసరావును చంపే విషయం పార్వతికి కూడా తెలియదని నరేష్ తెలిపాడు. నరేష్ కు తనకు వివాహేతర సంబంధం ఉన్న విషయం నిజమేనని కానీ చంపుతాడని మాత్రం తెలియదని పార్వతి తెలిపింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోని పట్టించుకోకపోవడం వల్లే తాను తప్పు చేశానని పార్వతి విలపించింది. చాలా విచిత్రం గా ఉన్న ఈ సంఘటన గుంటూరులో చర్చనీయాంశమైంది.