చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం, 200 కార్లు దగ్దం (వీడియో)

తమిళ నాడు రాజధాని చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 కి పైగా కార్లు దగ్థమయ్యాయి. పోరూరులోని ప్రైవేట్ కార్ పార్కింగ్ ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతున్నా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. కొంతమంది   ఈ మంటల్లోనే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. బెంగుళూరులో నిన్న జరిగిన ప్రమాదం మరువక ముందే చెన్నైలో ఈ  దారుణం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.