Sara Alikhan: టాలీవుడ్ రౌడీ పైన కన్నేసిన బాలీవుడ్ సోయగం

Sara Alikhan: విజయ్ దేవరకొండ.. యువతకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మరికొద్ది రోజుల్లో సౌత్ ఇండియా స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడంటే ఈ రౌడీ బాయ్ కి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో అనన్య పాండే హీరోయిన్ గా విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకి రానున్నది.

ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. అయినా ఆయన క్రేజ్ బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఉందంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా విజయ్ నటించాలని ఉవ్విళ్లూరిపోతున్నారు. ఇంతకీ ఆ స్టార్ కిడ్స్ ఎవరో కాదు.. సారా అలీఖాన్, జాన్వీ కపూర్. విజయ్ అంటే నాకు చాలా ఇష్టమని కైరా అద్వానీ కూడా ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించింది.

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో సారా అలీఖాన్ రౌడీబాయ్ విజయ్ దేవరకొండ పై కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. ధనుష్, అక్షయ్ కుమార్ కలిసి నటించిన ‘అత్రంగి రే’ మూవీ ప్రమోషన్స్ లో ‘విజయ్ దేవరకొండ చాలా కూల్ గా, హాట్ గా ఉంటాడు.. అతనితో నటించాలని ఉంది.. అంటూ ఈ అమ్మడు తన మనసులోని మాట మీడియా ముందు బయట పెట్టింది.