ఆయన అనూహ్యంగా మంత్రి పదవి సంపాదించుకున్నారు.. అయితే, అనూహ్యంగానే ఆయన పదవి కోల్పోబోతున్నారట. ఆయనెవరో కాదు, మంత్రి సీదిరి అప్పలరాజు.. అంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
2024 ఎన్నికలకు ముందర ఈ షాకింగ్ డెసిషన్ ఎందుకు వైఎస్ జగన్ తీసుకున్నట్లు.? గతంలో మాజీలైన మంత్రుల్లో ఎవరికైనా ఈసారి మంత్రులుగా ఛాన్స్ దొరుకుతుందా.? ఇలా వైసీపీలో చాలా ప్రశ్నలు చోటు చేసుకుంటున్నాయ్. ఆశావహులు, అధినేత వద్దకు క్యూ కడుతున్నారట.
అయినా, సీదిరి అప్పలరాజుని ఎందుకు తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుకుంటారు.? అంటే, మంత్రి అయ్యాక.. వివాదాల్లోకెక్కడం తప్ప, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో వుండటంలేదన్నది సీదిరి అప్పలరాజుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన ఫీడ్ బ్యాక్ అట.
మొత్తంగా నలుగురు లేదా ఐదుగురు మంత్రులు తమ పదవుల్ని కోల్పోయే అవకాశం వుందట. వారి స్థానంలో ఇద్దరు లేదా ముగ్గురికి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఇవ్వబోతున్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
ఇద్దరు మాజీ మంత్రులకూ ఇంకోసారి మంత్రిగా వైఎస్ జగన్ అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. లిస్టులో కొడాలి నాని పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తోంది. ‘కమ్మ’ సామాజిక వర్గం కోటాలో కొడాలి నానికే మళ్ళీ మంత్రి పదవి దక్కే అవకాశం వుందట.