అసెంబ్లీలో చంద్రబాబుని అలా అనేసి నవ్వులపాలు చేసిన ఎమ్మెల్యే రోజా!

ycp mla roja made shocking comments on chandra babu naidu in ap assembly

ఏపీ అసెంబ్లీ 4వ రోజున మహిళా సంక్షేమంపై చర్చ సందర్భంగా రోజా తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్ననారని, చంద్రబాబుది 420 విజన్‌ అని , వైఎస్‌ జగన్‌ గారిది విజన్‌, ఓ విప్లవం అన్నారు. వచ్చే జనరేషన్‌ గురించి ఆలోచించే ప్రజా నాయకుడని.. ప్రతి ఆడ బిడ్డను రక్షించే దిశ చట్టాన్ని తెచ్చారన్నారు.మహిళా సాధికారత కోసం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రోజా.

ycp mla roja made shocking comments on chandra babu naidu in ap assembly
ycp mla roja made shocking comments on chandra babu naidu in ap assembly

 నారా లోకేష్‌కు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ట్విటర్‌లో పెట్టడమే తెలుసు. సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అన్నారు. చంద్రబాబు కరోనా తర్వాత లాక్‌డౌన్ సమయంలో జూమ్ మీటింగ్‌లతో కెమెరా ముందు దూకుడు సినిమాలో బ్రహ్మానందంలా మాట్లాడారంటూ హేళన చేశారు.ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వైఎస్‌ జగన్‌, ఓ క్రియేటర్‌. వైఎస్ జగన్ ఫేక్ సీఎం కాదు టీడీపీ, చంద్రబాబును షేక్‌ చేసిన ముఖ్యమంత్రి అన్నారు.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని  అమలు చేశారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో సీఎం జగన్ మహిళలకే పెద్దపీట వేశారన్నారు. మహిళల అభ్యున్నతికి చంద్రబాబు చేసిందేమీ లేదనివ్యవస్థల్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు తోబుట్టువు కంటే ఎక్కువగా మహిళల్ని సీఎం జగన్ అభిమానిస్తారని.. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేశారన్నారు. క్రియేటివ్ ఆలోచనలు ఉన్న సీఎం వైఎస్ జగన్ మహిళలకు ఆస్తులను క్రియేట్ చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్ అన్నారు. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లపై కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారన్నారు.