వూరూర ఎన్నికల సుడిగాలి సృష్టించేందుకు వైసిపి సిధ్దమయింది.
వచ్చే ఎన్నికల్లో వైసిపి తరఫున నిలబడుతున్న అభ్యర్థులందరిని ప్రజలకు పరిచయం చేసేందుకు ఒక వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు. ఈ అభ్యర్థులందరికి ఒక నినాదం, ఒక కార్యక్రమం ఇచ్చి తమ తమ నియోజకవర్గాలలో ప్రజలతో సంత్సంబంధాలు పెట్టుకుని, జనామోదం పొందేందుకు 51 రోజుల కార్యక్రమం మీద సంచారం పంపిసున్నారు.

ఆగస్టు నెలలో 15 రోజులు, సెప్టెంబర్ లో 15 రోజులు, అక్టోబర్ 21 రోజులు వీరు తమ తమ నియోజకవర్గాలలో తిరగాల్సి ఉంటుంది, ప్రతి ఇంటి తలుపు తట్టి, జగన్ని, జగన్ పార్టీ వైసిపి గెలిపించాల్సిన చారిత్రాకవసరం గురించి ప్రతికుటుంబానికి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జూలై 29న తూర్పుగోదావరి జల్లా జగ్గంపేటలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ అభ్యర్థులందరితో ఒక సమావేశం ఏర్పాటుచేశారు. అయితే, అని వార్యకారణాల వల్ల ఈ కార్యకమ్రం ఒక వారం వాయిదా పడినట్లు పార్టీవర్గాలు ‘తెలుగు రాజ్యం’ కు చెప్పాయి. అయితే, కార్యక్రమం ధీమ్ లో మార్పు ఉండదని ఈ వర్గాలు తెలిపాయి.

ఎన్నికలు సమీపిస్తున్నందున వైసిసి అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని పార్టీ ని మొత్తం ఇక ప్రజలమధ్యే నిలబెట్టేందుకు ఈ కొత్త వ్యూహం రచించారు. ఇంతవరకు, గత నాలుగేళ్లుగా జగన్ మాత్రమే అలుపెరగకుండా ప్రజల మధ్య ఉన్నారు.
యువభేరీలు చేపట్టారు, ధర్నాలుచేశారు, నిరాహార దీక్షలు జరిపారు. ఇపుడు దాదాపు 222 రోజుల నుంచి ఆయన ప్రజాసంకల్ప సుదీర్ఘ యాత్రలో ఉన్నారు. ఇక తాను మాత్రమే కాకుండా పార్టీని యావత్తు జనం మధ్యకు తీసుకుపోయేందుకు నిర్ణయించారు. ఇపుడు పార్టీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు జనంలోకి వెళ్తారు. పార్టీ నియోజకవర్గం సమన్వయ కర్తలంటే ఎవరో కాదు, ఎమ్మెల్యే గా పోటీచేసేందుకు జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులే. వాళ్లంతా 51 రోజులు సుడిగాలిలో జనం మధ్య తిరగాలి.

ప్రతీ నియోజకవర్గ సమన్వయకర్తకు 3 వాహనాలను పార్టీ అందిస్తుంది. వీటి మీద ప్రధాన నినాదం స్టిక్కర్లుంటాయి.
ఈ స్టిక్కరింగ్ ఆయ ప్రాంతాలుగా అందుబాటులో ఉండేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు గా హైదరాబాద్ నుండి నియోజకవర్గ సమన్వయకర్తలకు అందిస్తారు. ఆగస్టు రెండో తేదీ నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కావలసి ఉండింది. అయితే, ఇది మారే అవకాశంఉంది.
నియోజకవర్గ సమన్వయకర్తలు 51 రోజులు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపు తట్టాల్సి ఉంటుంది. అంటే, తనని తాను పరిచయం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ లక్ష్యాలను వివరించడం ఇందులో ప్రధాన భాగం.
ఈ కార్యక్రమం మొత్తం రెండు నినాదాలతో సాగుతుందని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇందులో మొదటినినాదం ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎక్కుపెట్టింది,రెండోది పార్టీనేత పేరును ప్రజల్లోకి తీసుకెళ్లడం. ఇందులో మొదటి నినాదం ‘‘ నిన్ను నమ్మం బాబూ’, రెండోది ‘ రావాలి జగన్, కావాలి జగన్’.
‘తెలుగు దేశంనేతలు గ్రామ దర్శిని పేరుతో,అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ ప్రజలకుమాయమాటలు చెబుతున్నారు.వీటిని అభ్యర్థుల చేతనే తిప్పికొట్టించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. దీనితో పాటు అధికారంలోకి రాగానే జగన్ చేపట్టబోయే కార్యక్రమాలను గురించి వివరిస్తారు, ’ అనిపార్టీ వర్గాలుతెలిపాయి.

సాధారణంగా అభ్యర్థుల పేర్లను పార్టీలు చివరిదాక ప్రజలకు ప్రకటించవు. దీనికి కారణం, రకరకాల విమర్శలు వచ్చి అభ్యర్థుల అపకీర్తి పాలవుతారని భయం. అయితే, జగన్ చాలా ముందుగా తన సైన్యాన్ని జనంలోకి పంపిస్తున్నాడు. ఇలా చేసేందుకు గతంలో ఏ పార్టీ సాహిసించలేదు.
ఈ కార్యక్రమం తర్వాత పార్టీ నియోజకవర్గం సమన్వయ కర్తల పనితీరు, జనామోదం మీద ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే,అభ్యర్థిని మార్చేందుకు కూడా ఏ మాత్రం పార్టీవెనకాడదని చెబుతున్నారు.
