పవన్ రాయలసీమ నుంచి ఎందుకు పారిపోయారు?

జనసేన నేత పవన్ కల్యాణ్ రాజకీయం డొల్ల అని తేలిపోయింది. ఆయన దగ్గిర ఏ ఆలోచనా విధానం లేదు, ఒకసమస్య గురించి సరైన అవగాహన లేదు. రాష్ట్రంలో ఉన్న రాయలసీమ వంటి ఉప ప్రాంతాల గురించి, వాటిని పీడిస్తున్న సమస్యల మీద  పెద్ద విషయం పరిజ్ఞానం లేదు. ఆయన పార్టీ పెట్టడం, ఇపుడు ఎన్నికల ప్రచారం చేస్తున్న తీరు సినిమా ప్రిరిలీజ్ టూర్ లాగా ఉంది తప్ప సీరియస్ పొలిటికల్ క్యాంపెయిన్ లా లేదు అనేందుకు నిన్న అనంతపురం లో చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం.

ఆయన అనంతపురం నుంచి పరారయిపోయిరు. అక్కడే మొదటి పార్టీ కార్యాలయం పెడాతాను, అక్కడి నుంచే పోటీ చేస్తాను, విప్లవ నేత తరిమెల నాగిరెడ్డి స్ఫూర్తి అని ఎంత ఆవేశంతో ప్రకటించారో చూసే ఉంటారు. అంత హూంకరించిన వ్యక్తి దాదాపు ఏడాదికాలం రాయలసీమవైపూ కన్నెత్తి చూడలేదు. కర్నూలు కడప పర్యటనలు ఈ మధ్యే జరిగాయి. ఇపుడు ఎన్నికలపుడొచ్చి అనంతరపురం అంటే భయపడుతున్నట్లు చెప్పారు. అక్కడ పోటీ చేయలేను, గెలుస్తానన్న గ్యారంటీ లేదు, గెలిపిస్తాన్న భరోసా ప్రజలు ఇవ్వలేదు అని ప్రకటించారు.

ఒక ప్రాంతానికి వచ్చి ఇలా ప్రకటించిన రాజకీయ నాయకుడు పవన్ ఒక్కడే. పవన్ ను రాయలసీమ ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆయన సర్వేలే చెప్పాయి. అందుకని రాయలసీమనుంచి అందునా అనంతపురం నుంచి పారిపోయి ఎక్కడో గాజువాకలో తేలారు. ప్రజలను తన వైపు తిప్పుకోవడమే రాజకీయ విద్య. ఆ విద్య తెలియక ప్రజలు భరోసా ఇవ్వడం లేదని పారిపోతే ఎలా? భరోసా కల్పించాల్సిందెవరు?

రాయలసీమ ప్రజల నుంచి భరోసా ఎందుకు పొందలేకపోయారు? రాయలసీమ మనసు ఎందుకుదోచుకోలేకపోయారు. కనీసం చిరంజీవికి ఉన్న ధైర్యం కూడా పవన్ లేకుండా పోయింది. చిరంజీవిని సొంతవూర్లో ఓడగొట్టినా ఆయన పరువు కాపాడింది తిరుపతియే.
తనకే దిక్కు లేనపుడు తన పార్టీ అభ్యర్థుల గతేం కాను?

దీనికి కారణం ఒక్కటే ఆయనకు ప్రాంతీయ పరిజ్ఞానం బొత్తిగా లేకపోవడమే.
ఆయన దృష్టిలో రాయలసీమ అంటే కరువు ప్రాంతం.అది కూడా న్యూస్ పేపర్ హెడ్ లైన్ లనుంచి తెలుసుకున్నది.

కరువు కారణాలేమిటి? కరువు రాజకీయాలేమిటి? రాయలసీమ డిమాండ్లేమిటి, అక్కడే నీళ్లెందుకు లేవు, రాయలసీ కల్చరేమిటి? రాయలసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయమేటి వంటి విషయాలజోలికి వెళ్ల దలచుకోలేదు. రాయలసీమ మీద ఒక స్టాండ్ తీసుకోదల్చుకోలేదు. ఇది వపన్ సమస్యగాని, అక్కడి ప్రజల సమస్య కాదు. రాయలసీమకు జనరల్ భావోద్వేగా సినిమా ఫక్కీ ఉపన్యాసాలు తప్ప ఇచ్చిందేమీ లేదు. అందుకే అది అక్కడి ప్రజల మీద ప్రభావం చూపలేదు.

ఆయనకు శ్రీబాగ్ వప్పందం వంటి విషయాలు అసలు తెలియవు. ఆ మాట కూడా ఆయన వినివుండరు. ఇక నికర జలాలు, మిగులు జలాలు, జల వివాద ట్రిబ్యునళ్లు, వాటి అవార్డులు… ఆయనకు అవసరం లేదు.ఆయన చుట్టూ ఉన్నవాళ్లలో రాయలసీమ గురించిన విజ్ఞానవంతులెవరూ లేరు.అంతా ఫ్యాన్స్ అసోసియేషనే.  జైకొట్టే వాళ్లే.

అందుకే రాయలసీమ అంటే కరువు,కోస్తాంధ్ర అంటే కిడ్నీ సమస్య దాటి ఆయన విజ్ఞానం విస్తరించలేదు.  రాయలసీమ సమస్యలను ప్రస్తావించి హామీ లిస్తే కోస్తాలో కోపమొస్తుందేమో ననే భయం మాత్రం ఆయనలో దండిగా ఉంది. ప్రభుత్వాల రైస్ రాజకీయాలు ఇంతవరకు నీళ్లన్నీ ఒక ప్రాంతానికే తీసుకెళ్లాయి. మిగతా ప్రాంతాలు ఎండిపోయాయి.

ఇలాంటి మూలసమస్యలను ప్రస్తావించకపోవడం, కేవలం గొంతుచించుకునే ఆవేశం మాత్రం ప్రదర్శించడం వల్ల ఆయన పార్టీ ప్రభావం, ఆయన ప్రచారం ప్రభావం అనంతపురం కనిపించలేదు.

ఇదే ఆయన సర్వేల్లో గెలుపు భరోసా లేదని తెల్చి చెప్పింది. అందుకే ఆయన రాయలసీమ నుంచి దూరంగా  జరిగి ఓట్ల గ్యారంటీ ఉన్న సురక్షిత  ప్రాంతం వెదుక్కున్నారు.

అనంతపురం నుంచి పోటీ చేస్తే ఓడిపోతానన్న ఉద్దేశంతోనే అక్కడి నుంచి పోటీ చేయలేదని అని అనంతపురం చెప్పడం అక్కడి ప్రజలను తిరస్కరిస్తారని అంగీకరించడమే.

‘అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశానంటే ఓడిపోతాను. పార్టీ చేయించిన సర్వేలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అందుకే నేను పోటీ చేయకుండా టీసీ వరుణ్‌కు అనంతపురం టిక్కెట్ ఇచ్చాను,’ అని పవన్ కళ్యాణ్ . దీనికి కొసమెరుపు ఆయన అందదించారు.

‘ధైర్యంలేని వాళ్లు జనసేనలో ఉండొద్దు. భయపడే నాయకులు మాకు అవసరం లేదు. మార్పు రావాలంటే గొడవలకు సిద్ధపడాలని. భయపడితే మార్పు రాదు, ’అన్నారు.
ఎవరికి ధైర్యం లేదు, ఎవరు భయపడుతున్నారు?