జగన్ అంటేనే రివర్స్.. అప్పు చేసి ఎదురు ఖర్చు పెడతారు ?

jagan government

సహకార రంగంలో లాభాలను ఆర్జిస్తున్న రంగం ఏదైనా ఉంది అంటే కేవలం డెయిరీ రంగమే అనాలి. మన రాష్ట్రానికి చెందిన విజయ డెయిరీకి దేశవ్యాప్తంగా గొప్ప పేరుంది. ఇప్పుడు మన ప్రభుత్వ నాయకులు అమూల్, అమూల్ అంటూ ఆ సంస్థను ఎంతో గొప్పదని ఎలాగైతే కీర్తిస్తున్నారో విజయ డెయిరీ కూడ దాదాపు అంతే గొప్పది. విజయ డెయిరీ అనేది తెలుగు పదమని దానికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఎక్కడుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఉంది. ఏడాది 700 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాగల సామర్థ్యం ఉన్న డెయిరీ అది. అంతేకాదు రోజు 5 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తుల రూపంలోకి ప్రాసెసింగ్ చేయగలదు. ఇంకా రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న డెయిరీలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఇప్పడు వీటన్నింటినీ కాదని పరాయి రాష్ట్రానికి చెందిన అమూల్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు.

jagan government
Why AP government spending 3000 crores to Amul

తీసుకొచ్చేస్తుంది ఏదైనా పెట్టుబడి రూపంలో తెస్తున్నారా అంటే అదీ లేదు. ఎదురు పెట్టుబడి పెట్టి మరీ అమూల్ సంస్థను దింపుతున్నారు. కొత్త సంస్థలు రావడం అంటే పెట్టుబడులు తీసుకుని రావాలి. వాటికీ కావాల్సిన వెసులుబాట్లు, సహకారం ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇక్కడ 3000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే అమూల్ కోసం ఖర్చు చేయడనుండటం విచిత్రంగా ఉంది. రాష్ట్ర ఖజానాలో డబ్బు పొర్లిపోతుంటే ఈ పని చేసినా అర్థం ఉంది. కానీ చిల్లిగవ్వలేని ఖజానా పెట్టుకుని ఎదురు పెట్టుబడుల కోసం అప్పులు తెస్తున్నారు. ఈ భారమంతా రాష్ట్ర ప్రజల మీదే కదా పడేది. ఇంత కష్ట కాలంలో ఇలా అప్పులు చేసి అమూల్ సంస్థకు దారబోయడం అవసరమా అంటున్నారు చాలామంది.

ఒకవేళ డెయిరీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యమే ఉంటే రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పడి ఉన్న డెయిరీ సంస్థలకు సంహారం అందించవచ్చు. మరిన్ని ప్రోత్సాహకాలిచ్చి ముందుకు తీసుకెళ్లవచ్చు. పాడి రైతులను ప్రోత్సహించి పాల్ ఉత్పత్తిని పెంచి ఎగుమతుల స్థాయిని అభివృద్ధి చేయవచ్చు. కానీ అలాంటివేం లేకుండా ఒక పెద్ద సంస్థను డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చి స్థానిక సెయిరీలను దాని కింద నలిగిపోయేలా ప్రమాదాన్ని సృష్టిస్తున్నారు. అమూల్ పాల సేకరణలోకి దిగిందంటే చిన్నా చితకా డెయిరీలో కాదు ఒంగోలు డెయిరీ లాంటి మధ్యతరహా డెయిరీలను కూడ మిగేస్తుంది. సంగం డెయిరీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడ ఇదే అంటున్నారు.

ఒంగోలు డెయిరీ సేకరించే పాలను అమూల్‌కు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. ఒంగోలు డెయిరీకి ఏడాది క్రితం రూ.3 వేలు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఆయన మాటలను అంత ఈజీగా కొట్టిపారేయలేం. ఎందుకంటే సహకార సంఘాల డెయిరీల గురించి ఆయనకు గొప్ప అవగాహన ఉంది. సంఘాల వ్యవహారం, డెయిరీల పనితీరు, అభివృద్ధి ఎలా చేయాలి, చిన్న స్థాయి డెయిరీలు ఎలాంటి కష్టాలు పడుతున్నాయి అనేది ఆయనకు అవగాహన ఉంది. అందుకే సొంత డెయిరీలను కాదని అప్పులు తెచ్చి మరీ అమూల్ సంస్థకు పెట్టడం అనేది ఎంతవరకు సబబో ప్రభుత్వమే చెప్పాలి.