ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చిన వీఆర్వో దరఖాస్తులు

సెప్టెంబర్ 16 ఆదివారం రోజు వీఆర్వో పరీక్ష ఉంటుందని టిఎస్ పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. అభ్యర్దులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఎంత తొందరగా డౌన్ లోడ్ చేసుకుంటే అంత మంచిదని ఆమె అభ్యర్దులకు సూచించారు. హాల్ టిక్కెట్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయన్నారు.

వీఆర్వో పరీక్షకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన వీఆర్వో పరీక్షకు 7 లక్షల దరఖాస్తులే  వచ్చాయన్నారు. 31 జిల్లాల్లో 2945 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బుధవారం వరకు 7 లక్షల మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్నారు. కొంత మందిని వారు కోరుకున్న సెంటర్లలో కాకుండా పక్క జిల్లాల్లో వేశామని పరీక్ష రోజు కేంద్రాలకు తొందరగా చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్దులకు సూచించారు. హెచ్ ఏండీఏ పరిధిలో 3 లక్షల మంది పరీక్ష రాస్తున్నారన్నారు. చాలా మందికి సెంటర్లు సరిపోక దూరపు ప్రాంతాలలో వేయాల్సి వచ్చిందని పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకునేలా అభ్యర్దులు ప్రణాళిక వేసుకోవాలన్నారు. రవాణా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ముందు రోజే సమీప ప్రాంతాలకు చేరుకొని దగ్గర్లో ఉండి పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకోవాలన్నారు. హాల్ టికెట్ లో ఉన్న సూచనలు అనుసరించి పరీక్షను రాయాలన్నారు. 

ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షకు వచ్చే ముందు ఐడీ ప్రూఫ్, హాల్ టిక్కెట్ తప్పని సరి అని తెలిపారు. ఏ ఒక్కటి లేకపోయినా పరీక్షకు అనుమతించమన్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని మాల్ ప్రాక్టీస్ చేస్తే కేసు బుక్ చేసి భవిష్యత్తులో ప్రభుత్వ పరీక్షలకు అనుమతించకుండా కేసు ఫైల్ చేస్తామని తెలిపారు. బయో మెట్రిక్ ఏం లేదన్నారు. వివరాలు తప్పుగా నమోదు చేసుకున్న 2 వేల మంది అభ్యర్ధులకు ఎడిట్ చేసుకోవాలని మెసేజ్ పెట్టామని వారు ఎడిట్ చేసుకోని హాల్ టిక్కెట్ పొందాలని తెలిపారు. అభ్యర్దులు అన్ని సూచనలు పాటించి  పరీక్షకు హాజరుకావాలని సెక్రటరీ వాణీ ప్రసాద్ తెలిపారు.