షాకింగ్ : పవన్ కళ్యాణ్ పై ఫేక్ ప్రచారం? వెనుక అసలు స్టోరీ ఇదేనట.!

తెలుగు సినిమా దగ్గర భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. అయితే పవన్ ఇప్పుడు తన సినిమాతో పాటుగా రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ రాజకీయాల్లో కూడా ఆరోగ్యం బాగోలేక కాస్త రెస్ట్ తీసుకుంటుండగా తాజాగా పవన్ పై ఓ షాకింగ్ వార్త అయితే బయటకి వచ్చింది.

పవన్ కి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఫార్మ్ హౌస్ ని ఇప్పుడు పడగొట్టి దాని ప్లేస్ లో మరో భారీ హౌస్ ని నిర్మించాలని డిసైడ్ అయ్యారని ఇప్పటికే వాటి పనులు కూడా చేపట్టారని పలు వార్తలు బయటకి వచ్చాయి. అయితే దీనిపై పలు షాకింగ్ రూమర్స్ మరో రీతీలో వైరల్ గా మారిపోయాయి.

పవన్ మొత్తం 160 కోట్లకి ఆ ఫార్మ్ హౌస్ ని నిర్మిస్తున్నాడని ఓ గాసిప్ సినీ వర్గాల్లో కంటే రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారి వినిపిస్తుంది. అంటే దీనితో పవన్ కి ఇంత డబ్బు ఎక్కడిది అని ఎవరి దగ్గర నుంచో వచ్చిందే అని కొన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ దీని వెనుక అసలు స్టోరీ ఏమిటంటే..

పవన్ 160 కోట్లతో నిర్మిస్తున్నాడన్న మాట అబద్దం అని అక్కడ తన ల్యాండ్ విలువ అంత ఉంటుంది అనే మాటని వేరే విధంగా మార్చి ప్రచారం చేయడమే కాకుండా దానిని పవన్ 5 కోట్లు పెట్టి నిర్మిస్తున్నాడని ఇవి పవన్ కి ఇల్లీగల్ గా వచ్చినవి అంటూ పలు రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు.

మరి దీనితో అయితే పవన్ ఫ్యాన్స్ కూడా ఈ ఆరోపణలు చేస్తున్న వారిని పవన్ పై కేస్ పెట్టి అయినా నిరూపించాలని ఛాలెంజ్ చేస్తున్నారు. అలాగే పవన్ డబ్బే ముఖ్యం అనుకుంటే ఈ పాటికే ఎన్నో యాడ్స్ చేసుకుని ఉండేవాడని అంటున్నారు. మొత్తానికి పవన్ పై అయితే ఈ షాకింగ్ ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.