వైద్య వృత్తిలో ఉంటూ నీచమైన పనికి వడిగట్టిన ఆర్ఎంపి మహిళా డాక్టర్.. బయటపడిన డాక్టరమ్మ బాగోతం!

దేవుడు తర్వాత వైద్యులను దేవుడుగా భావించి పూజిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం వైద్యవృత్తికి మాయని మచ్చగా మారుతూ ఉంటారు. వైద్యవృత్తిని ఆసరాగా చేసుకొని ఎన్నో చండాలమైన పనులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన విజయవాడలో ఒకటి చోటు చేసుకుంది. విజయవాడలో గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ రాధిక అనే మహిళ తన వైద్య వృత్తిని అడ్డుపెట్టుకొని వ్యభిచార గృహాన్ని నడుపుతూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయవాడ గాంధీనగర్లో రాధిక భర్త ఆర్ఎంపీ డాక్టర్ గా విధులు నిర్వహించారు. ఈయన ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి కరోనా సమయంలో ప్రాణాలు వదిలారు. భర్త లాగే ఆమె కూడా ఆర్ఎంపీ డాక్టర్గా విధులు కొనసాగిస్తున్నారు.అయితే ఎంతో మంది అమ్మాయిలను ఒక వాట్సాప్ గ్రూప్ గా క్రియేట్ చేసిన రాధిక పెద్ద ఎత్తున వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. ఇలా డాక్టర్ పేరుతో వ్యభిచారం చేయిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు.

ఈమె వ్యవహార శైలపై అనుమానం వచ్చిన స్థానికులు ఈమె పట్ల ఓ కంట కనిపెట్టారు. అయితే తాజాగా ఓ కుర్రాడు 10000 రూపాయలకు ఒక అమ్మాయిని బుక్ చేసుకున్నారు 5000 రూపాయలు తను తీసుకొని మరో 5000 రూపాయలు అమ్మాయికి ఇవ్వమని చెప్పి తనని అమ్మాయి గదిలోకి పంపించారు.ఇది తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఇలాంటి పనులకు ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ రాధికను పోలీసులు అరెస్టు చేశారు.