జగన్ మీద సంచలన ఆరోపణలు చేసిన రఘురామ కృష్ణంరాజు

Raghuram Krishnaraja made sensational allegations against Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల కోసం వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జగన్ పుట్టిన రోజు వేడుకల కోసం కొందరు వైసీపీ నేతలు వ్యాపారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల నుంచి వసూలు చేసే ఈ జే టాక్స్‌ను ఆపాలని వ్యాఖ్యానించారు.

Raghuram Krishnaraja made sensational allegations against Jagan
Raghuram Krishnaraja made sensational allegations against Jagan

కరోనా సమయంలో వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దుష్టశక్తుల నుంచి వ్యాపారులను కాపాడండి అని ముఖ్యమంత్రి జగన్‌ను ఎంపీ రఘురామ కోరారు. మీ పుట్టిన రోజు వేడుకల కోసం సొంత డబ్బు గానీ ప్రభుత్వ డబ్బు కానీ వాడండి వ్యాపారుల నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న దుష్ట శక్తుల వల్ల పార్టీ పరువు, మీ పరువు పోయే ప్రమాదముందని వ్యాఖ్యానించారు.

జగన్ బర్త్ డే కోసం చేస్తున్న వసూళ్ల వల్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రఘురామ అన్నారు. చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని చెప్పారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్‌ జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు. చిరు వ్యాపారుల పండ్ల వ్యాపారాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి పుట్టిన రోజు వేడుకల పేరుతో నేతల చేసున్న డబ్బులు వసూలు కార్యక్రమం ఆపండి అని రఘురామ అన్నారు.