పవన్ కూడా రాజకీయం మొదలెట్టేసాడుగా?

Pawan also start real politics?

తెలుగు సినిమా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు తనకి తానే పోటీగా, అభిమానులు గుండెల్లో దేవునిగా, నెంబరు1 స్థానంలో ఉన్నప్పుడే ప్రజలకి ఏదేదో చెయ్యాలనే తపనతో రాజకీయ ఆరంగ్రేట్రం చేశారు.ఇంతవరకు ఆయన రాజకీయంలో హిట్ కొట్టలేదు. ఎప్పుడు ఎదో ఒక పార్టీ తో పొత్తు, లేదా సపోర్ట్ గా ఉండడం వల్ల సదరు పార్టీ పవన్ ఇమేజ్ ని ఉపయోగించుకుని ఎదుగుతుంది తప్పా జనసేనకు మాత్రం ఎటువంటి ఉపయోగం కలగట్లేదు. ఇక మొన్నటి ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు తో ముందుకు వెళ్తున్నారు.

Pawan also start real politics?
Pawan also start real politics?

బీజేపీ కూడా జనసేనను తొక్కేసే విధానాన్ని అవలంభిస్తుంది అని వారి చర్యలను బట్టి తెలుస్తుంది.మొన్నటికి మొన్న గ్రేటర్ ఎలక్షన్స్ లో జనసేన ను పాల్గొననివ్వలేదు.. పైగా దెప్పిపొడుపులు జనసేన ను నీరుగారే విధంగా ఉన్నాయి.. పోనీ సొంత రాష్ట్రంలో అయినా పోటీ చేద్దామనుకుంటే అక్కడ కూడా బీజేపీ పడనివ్వట్లేదు.. రాష్ట్రంలో త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగనుంది.. ఇక్కడ ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ, జనసేన ఇంత వరకు క్లారిటీ లేదు.

అయితే ఇప్పటివరకు చేసింది చాలని పవన్ కళ్యాణ్ సోము వీర్రాజు కి వ్యతిరేకంగా పావులు కడుపుతున్నాడట..బిజెపిలో తటస్థంగా వ్యవహరించే నేతలకు సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చడం లేదు. ఆయనను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించలేదు అంటే కూటమి అధికారంలోకి కాదు కదా కనీసం డిపాజిట్ లు కూడా వచ్చే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ బిజెపి అధిష్టానానికి మొన్న ఢిల్లీ పర్యటనలో చెప్పారట. ఆయన సొంత నిర్ణయాలు మినహా పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలు ఏమీ లేవని, ఆయన ఏపీలో పార్టీని బలోపేతం చేసే అంత బలవంతుడు కాదని బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు కూడా బిజెపి పెద్దలకు నివేదికలు పంపించారు. పవన్ కళ్యాణ్ అయితే పొత్తును కూడా వాడని బిజెపికి చెప్పినట్టుగా సమాచారం.