ఎప్పుడైనా సరే మనగురించి మనం డప్పు కొట్టుకుంటే మనకు బాగున్నట్లు అనిపించినా.. వినేవారు నవ్వుకుంటూ ఉంటారు. ఆ సృహలేకపోతే ఎంతవయసొచ్చినా ఈ పిచ్చి పోదు! దేశంలో జరిగే ప్రతీ గొప్ప పనికే తానే కారణం అని చెప్పుకోవడం వల్ల విలువ పెరగదు సరికదా.. కామెడీ పీస్ అయిపోతారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక నేత ఉన్నారు!
ఆ సంగతి అలా ఉంటే… జగన్ రియల్ హీరో అని, అధికారంలోకి వచ్చిన అనంతరం సాధించిన ఘనత ఇది అని తాజాగా విషయాలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా… నీతి ఆయోగ్ కీలక విషయాలు వెళ్లడించింది. పోసుకోలు కబుర్లు చెప్పుకుని తిరిగే నేతలకూ, మాయమమటలు చెప్పి జనాలను మోసం చేసే నేతలకూ… ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే నాయకూలకూ ఉన్న తేడాను స్పష్టం చేసింది.
అవును… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటోన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఏనాడూ జరగని విధంగా అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల నుంచే అమలు చేస్తూ వస్తోన్న నవరత్నాలు పేదరికాన్ని రూపుమాపుతోన్నాయి. పేదలకు ఆర్థిక స్వావలంబనను కల్పిస్తోన్నాయి.
వైఎస్ జగన్ సర్కార్ నవరత్నాలు పేరుతో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హత గల చిట్టచివరి వ్యక్తి వరకు అందుతోండటం.. సత్ఫలితాలను ఇస్తోంది. పైగా అవినీతికి ఏమాత్రం తావులేకుండా జరుగుతుండటంతో ఫలితాలు మరింత వేగంగా వస్తున్నాయి. ఇదే విషయాన్ని, తద్వారా వచ్చిన ఫలితాలను తాజాగా నీతి ఆయోగ్ నివేదికలు వెల్లడించాయి.
ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పింఛన్ల పెంపు, వైఎస్సార్ రైతు భరోసా, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఆసరా, చేయూత.. వంటి పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఆయా పథకాల కింద వైఎస్ జగన్.. నేరుగా బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులను బదలాయిస్తోన్నారు. ఇది అంచనాలకు మించి సత్ఫలితాలను ఇస్తోంది.
ఫలితంగా… పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తోన్న జగన్ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. నాలుగు సంవత్సరాల కిందట మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు.. పేదలను ఆర్థికంగా నిలబెడుతున్నాయి. దీంతో ఏపీలో పేదరికం చాలా జిల్లాల్లో 50శాతానికి పడిపోయింది. సుమారు సగానిపైగా పేదలను జగన్ తన సంక్షేమ పాలనలో తగ్గించగలిగారు. ఇది సొంతపత్రికలు చెబుతున్న సెల్ఫ్ డబ్బా కాదు.. సొంత ఛానళ్లలో వేస్తోన్న ప్రత్యేక కథనాలు కదు.
అవును… ఏపీలో పేదరికం చాలా వరకూ తగ్గిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం… 2016లో (చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో) ఏపీలో పేదరికం రేటు 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72 శాతంగా నమోదైన పేదరికం.. 2021 నాటికి 7.71 శాతానికి తగ్గింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో 2016లో పేదరిక శాతం 4.63 ఉండగా.. 2021 నాటికి అది 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది. దీంతో… జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
జగన్ పాలనలో పేదరికం ఎంతమేర తగ్గిందనే విషయాలు చూసినట్లయితే…
విజయనగరం జిల్లాలో చంద్రబాబు హయాంలో పేదరికం 19 శాతం ఉండగా… జగన్ పాలనలో అది 8.66శాతానికి పడిపోయింది.
శ్రీకాకుళం జిల్లాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదరికం 14.01శాతం ఉండగా… జగన్ హయాంలో అది 5.20శాతానికి పడిపోయింది.
విశాఖ జిల్లా విషయానికొస్తే… చంద్రబాబు సమయంలో 15.10శాతం పేదరికం ఉండగా… జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7.60 శాతానికి తగ్గింది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు హయాంలో పేదరికం 8.51శాతం ఉండగా… జగన్ హయాంలో 6.13శాతానికి తగ్గింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ పాలనలో పేదరికం 9.11శాతం ఉండగా… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.42శాతానికి పేదరికం పడిపోయింది.
కృష్ణాజిల్లాలో… 8.69శాతం పేదరికం చంద్రబాబు హయాంలో ఉండగా… అది జగన్ పాలనలో 4.38 శాతానికి పడిపోయింది.
గుంటూరు జిల్లాలో.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7.26శాతం పేదరికం ఉంటే… జగన్ ముఖ్యమంత్రి అయినతర్వాత 4.36శాతానికి తగ్గింది.
ప్రకాశం జిల్లాలో పరిస్థితిని గమనించినట్లయితే… చంద్రబాబు హయాంలో ఈ ఉమ్మడి జిల్లాలో పేదరికం 13.84శాతం ఉండగా.. జగన్ సీఎం అయ్యాక 6.28శాతానికి పేదరికం పడిపోయింది.
కడప జిల్లాల్లో చంద్రబాబు హయాంలో పేదరికం 9.14% ఉండగా… జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పేదరికం 3.34 శాతానికి పడిపోయింది.
కర్నూలు జిల్లాలో 19.64శాతం పేదరికం చంద్రబాబు హయాంలో ఉండగా… జగన్ సీఎం అయిన తర్వాత వీరి సంఖ్య 12.84శాతానికి పడిపోయింది.
అనంతపురం జిల్లా విషయానికొస్తే… చంద్రబాబు పాలనలో ఈ జిల్లాలో 12.47% ప్రజలు పేదరికంలో మగ్గిపోతే… జగన్ సీఎం అయిన తర్వాత ఈ పేదరికంలో 6.74శాతానికి తగ్గిపోయింది.
చిత్తురు విషయానికొస్తే… చంద్రబాబు హయాంలో తన సొంత జిల్లాలో 9.64 శాతం పేదరికంతో జనం మగ్గుతుంటే… జగన్ సీఎం అయినతర్వాత వీరి సంఖ్య 5.66శాతానికి పడింది.