చంద్రబాబు కొత్త డ్రామాలు

చంద్రబాబునాయుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలపై అనర్హత వేటు పడేంతవరకూ పోరాటాలు చేయాలట. భలే విచిత్రంగా ఉంది కదు చంద్రబాబు ఆదేశాలు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ రాజ్యసభ ఎంపిలు పార్టీని ఫిరాయించి దానికి విలీనం అనే ముసుగు వేశారని మండిపోయారట.

అసలు ఎంపిలు పార్టీ ఫిరాయించింది చంద్రబాబు ఆదేశాల ప్రకారమే అని ఓ వైపు పార్టీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కేసుల నుండి రక్షణ కోసమే అందరూ కూడబలుక్కుని నాటకాలు ఆడినట్లు మామూలు జనాలకు కూడా అర్ధమైపోయింది. చాలా సీక్రెట్ అనుకున్న వ్యూహం కాస్త బట్టబయలైపోయిన తర్వాత కూడా చంద్రబాబు డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో అర్ధం కావటం లేదు.

ఆరుగురు ఎంపిల్లో నలుగురు పార్టీ ఫిరాయించటం వారిని బిజెపిలో విలీనం చేసేసినట్లుగా రాజ్యసభ సచివాలయం గెజెట్ నోటిఫికేష్ ఇవ్వటం కూడా అయిపోయింది. రాజ్యసభ వెబ్ సైట్ లో ఫిరాయించిన నలుగురు ఎంపిలు బిజెపి సభ్యులుగా కనబడుతున్నారు.

విలువలు గురించి వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే రాజ్యసభ ఛైర్మన్ , ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలోనే నిసిగ్గుగా ఎంపిల ఫిరాయింపు అంశం దిగ్విజయంగా పూర్తయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఫిరాయించిన ఎంపిలు టిడిపిని దెబ్బ తీశారని, వ్యక్తిగత అజెండాతోనే వాళ్ళు పార్టీ మారినట్లు విదేశాల నుండి చంద్రబాబు చెప్పటమే విడ్డూరంగా ఉంది.