తప్పుడు అఫిడివిట్ తో న్యాయవ్యవస్ధలో చంద్రబాబు చిచ్చు

 న్యాయవ్యవస్ధలో కూడా చంద్రబాబునాయుడు పెద్ద చిచ్చే పెట్టారు. చంద్రబాబు పెట్టిన  చిచ్చు వల్లే న్యాయవాదులు, న్యాయమూర్తులు రోడ్డున పడాల్సొచ్చింది. జనవరి 1వ తేదీ నుండి ఏపికి ప్రత్యేక హై కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ కు కారణం చంద్రబాబు సుప్రింకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్టే కారణం. తెలుగురాష్ట్రాలు రెండుగా విభజన అయినపుడు హై కోర్టు విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హై కోర్టు కూడా విడిపోవాల్సిందే అంటూ తెలంగాణ ప్రభుత్వంతో పాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఏపిలో హై కోర్టు ఏర్పాటుకు సరైన భవనాలు లేని కారణంగా విభజన సాధ్యంకాదని చంద్రబాబు గతంలో చప్పారు.

 

అయితే, హైకోర్టు విభజనకు డిమాండ్ పెరిగిపోతుండటంతో పాటు షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో చంద్రబాబు మాటమార్చి సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అధునాతన టెక్నాలజీతో భవనాలు నిర్మిస్తామని డిసెంబర్ 15 కల్లా భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని అఫిడవిట్లో హామీ ఇచ్చారు. దాని ఆధారంగానే సుప్రింకోర్టు ఆదేశాలతో కేంద్రం హైకోర్టును విభజిస్తు నోటిఫికేషన్ ఇచ్చింది. భవనాలు ఏమీ రెడీ కాకుండానే హై కోర్టును విభజించటంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా కేంద్రంతో పాటు చంద్రబాబు పైన కూడా మండిపోతున్నారు.

 

ఎందుకంటే, హై కోర్టును విభజిస్తు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయటంపై చంద్రబాబు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డిసెంబర్ 15వ తేదీకల్లా భవనాలు పూర్తి చేస్తానని అఫిడవిట్ ఇచ్చిందీ  చంద్రబాబే. హై కోర్టు విభజిస్తు నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రంపై మండిపడుతున్నదీ చంద్రబాబే. అంటే సుప్రింకోర్టును, హై కోర్టులో న్యాయవాదులు, న్యాయమూర్తులను తప్పుదోవ పట్టించిన చంద్రబాబు తీరిగ్గా కేంద్రం కుట్ర చేస్తోందంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారు. మొత్తానికి హై కోర్టు భవనాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు, కేసులు ఎలా విచారిస్తారో తెలీక అందరూ అయోమయంలో పడిపోయారు.