జన సంద్రం తోడు రాగా జగన్ నామినేషన్

 వేలకు వేలు.. జనం జనసంద్రమై వెంటరాగా వైసిపి అధినేత జగన్మోహన్ ెడ్డి ఈ రోజు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా తన వెంటన నిలిచిన జనానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అయితే, కొన్ని హెచ్చరికలు కూడా చేశారు.  జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తొందరలో కొన్ని అరెస్టులు చేయించేందుకు చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికార పార్టీనే వివేకాను హత్య చేయించి ఎదురు వైఎస్ కుటుంబమే హత్య చేయించిందనే బురద చల్లుతున్నట్లు మండిపడ్డారు.

అందులో భాగమే  తొందరలో కొన్ని అరెస్టులు కూడా ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో తాను మళ్ళీ  పులివెందులకు రాకపోవచ్చని అన్నారు.  తమ కుటుంబంలో కొందరిని అరెస్టులు చేయటానికి రంగం సిద్ధమైందని కూడా అన్నారు. కాబట్టి గతంలో లాగే రాబోయే ఎన్నికల్లో కూడా ఆశీర్వదించాలని కోరారు.  వివేకా హత్యకేసులో జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారమే మొదలైంది. మూడు రోజుల్లో సంచలనాలు రేపేందుకు అధికార టిడిపి కుట్రలు చేస్తోందని కూడా జగన్ ఆరోపణలు చేయటం గమనార్హం.

జగన్ నామినేషన్ సందర్భంగా పులివెందుల జనసంద్రమైంది. చిన్న వూరు పులివెందుల జనమహా సముద్రమయింది,అభిమానులతో, అభిమానంతో.

నామినేషన్ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుండి వైఎస్ అభిమానులు పోటెత్తారు. మధ్యహ్నం 1.49 గంటలకు కడప ఎంపి అభ్యర్ధి అవినాష్ రెడ్డి తదితరులు వెంటరాగా జగన్ తన నామినేషన్ పత్రాలను  పులివెందుల రెవిన్యు అధికారులకు జగన్ అందించారు.

అంతుకుముందు పులివెందులలోనే ఉన్న సిఎస్ఐ చర్చి గ్రౌండ్ లో బహిరంగసభలో పాల్గొన్నారు. బహిరంగసభ సందర్భంగా దివంగ ముఖ్యమంత్రి వైఎస్ జిల్లాకు, పులివెందులకు చేసిన సేవలను, అభివృద్ధిని  జగన్ ప్రజలకు గుర్తు చేశారు.