బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానం దొరకాలంటే గతంలో చంద్రగిరిలో జరిగిన కొన్ని పరిణామాలని పరిశీలించాలి.

2018 జూలైలో, ఈ ప్రాంత దళితులు తమకు స్వేచ్ఛగా ఓటువేసుకునే అవకాశం కల్పించాలని,దాని కొరకు ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటుచేయాలని చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారిని సుధారాణికి విన్నవించుకున్నారు. సమస్యను అర్ధం చేసుకున్న సుధారాణి గారు కూడా తన రిపోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించి దళితులకు రక్షణ కల్పించి,వారు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలిపించాలని సిఫారసు చేశారు. ఏమి జరిగిందో ఏమో కొన్ని నెలల వ్యవధిలోనే సుధారాణి బదిలీ అయ్యింది.

2018 నవంబర్-డిసెంబర్ లలో తాశీల్ధార్ లోకేశ్వరి గారికి దళితులు ఇదే సమస్యను విన్నవించుకున్నారు,ఆవిడ కూడా దళితులు ఓటును వినియోగించటానికి చర్యలు తీసుకోవాలని తన రిపోర్టులో వ్రాసింది …ప్రతిఫలంగా ఆవిడ కూడా బదిలీ అయ్యింది .

చంద్రగిరిని ఎలాగైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికలకన్నా దాదాపు 8 నెలల ముందు 2018 సెప్టెంబర్లో పులిపర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో ఈ ఐదు పోలింగ్ బూతుల్లో ఏకపక్ష పోలింగ్ జరిపించారు.

ఇది గమనించిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సమస్యను విడవకుండ కేంద్ర ఎన్నికల సంఘం వరకు తీసుకెళ్ళటంతోనే ఇప్పుడు రీ-పోలింగుకి ఆదేశించారు. గత ఎన్నికల్లో చెవిరెడ్డి కేవలం 4500 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సారి కూడా ఇక్కడ చాల రసవత్తర పోరు జరిగింది. తెలుగుదేశంకు అనుకూలంగా పోలైన పదివేలు ఓట్లు మల్లి పోలింగ్ జరపడమంటే అది తెలుగుదేశం విజయాన్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది . అందుకే బాబు గారు ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ ని కలిసి ఇది వివక్షత అని ఆరోపించారు. అయితే ఈసీ వారు తాపీగా పోలింగ్ జరిగిన తీరు వీడియోలో చూపించి రీపోలింగ్ జరపడం వివక్ష కాదండి పోలింగ్ రోజున దళితుల్ని ఓటుకు రాకుండా చెయ్యడం వివక్షత అని కౌంటర్ సమాధానం ఇచ్చారట.

పోలింగ్ జరిగిన ఇన్నిరోజులు తర్వాత రిపోలింగ్ అన్యాయం అని తేల్చిన బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరో పదిహేను చోట్ల రిపోలింగ్ జరపండి అని కోరడం కొసమెరుపు.