ఆంధ్రా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రా నిరుద్యోగులకు శుభవార్త. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. పోలీసు శాఖలో పెద్ద ఎత్తున నియామకాలకు ఆంధ్రా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సుమారు 2684 పోస్టుల భర్తీకి అక్టోబర్ నెలలోనే నోటిఫికెషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

దీనితోపాటు డిఎస్సి నోటిఫికెషన్ కి కూడా రంగం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ కూడా ఈ నెలలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చదవండి.

పోలీసు శాఖలో 2500 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా పోలీసు నియామక మండలి సన్నాహాలు చేస్తోంది. మినిస్టీరియల్ విభాగంలో 184 ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపింది. వీటికి కూడా పర్మిషన్ లభిస్తే నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అవుతోంది. 2016 లో నియామకాలు భర్తీ చేసిన ప్రక్రియనే ఈసారి కూడా ప్రభుత్వం అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కూడా స్వీట్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. డిఎస్సి నోటిఫికేషన్ కి కూడా రంగం సిద్ధం అయింది. ఈ నెల 10 న డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. నవంబర్ 30 వ తేదీ నుండి డిఎస్సి రాత పరీక్షలు ప్రారంభం అవనున్నాయి.