వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగిడిన చంద్రబాబు.. వైసీపీ నేతలకు ఇది శుభవార్తేగా?

చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజ జీవితంలో స్నేహితులు అనే సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలలో ఉన్న సమయంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉంటే టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని చంద్రబాబు నాయుడు అప్పట్లో భావించారంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో సులువుగా అర్థమవుతుంది.

అయితే అమరావతి వివాదాలు – వాస్తవాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదని పనులు మాత్రమే శాశ్వతమని చెప్పుకొచ్చారు. మనం చేసిన పనుల వల్ల రాజకీయ లబ్ధి జరిగిందా లేక ప్రజలకు లబ్ధి జరిగిందా అనేది చూడాలని ఆయన చెప్పుకొచ్చారు.

2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సైబరాబాద్ ను నిలిపివేయాలనే ఆలోచన చేయలేదని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు టీడీపీ హయాంలో భూములు సేకరించామని ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారని చంద్రబాబు కామెంట్లు చేశారు. జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగించి ఉంటే బాగుండేదనే అర్థం వచ్చేలా చంద్రబాబు పరోక్షంగా సెటైర్లు వేశారు.

అయితే చంద్రబాబు నాయుడు జగన్ పాలనను మెచ్చుకోవడం అంటే ఒక విధంగా తమకు తీపికబురే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు జగన్ పాలనను మెచ్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.