బిగ్ బ్రేకింగ్ న్యూస్… కాంగ్రెస్ లోకి ప్రజా గాయకుడు గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. గజ్వేల్ నుంచి పోటి చేసే యోచలనలో గద్దర్ ఉన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క గద్దర్ తో చర్చలు జరిపి గద్దర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

గద్దర్ ఇప్పటికే ఢిల్లికి చేరుకున్నారు. గద్దర్ తో పాటు ఆయన కుమారుడు ఉన్నారు. గద్దర్ కుమారుడు కూడా ఎన్నికల్లో పోటి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే గద్దర్ తో పాటు ఆయన కుమారుడు కూడా ఢిల్లీ వెళ్లారు.  గద్దర్ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అంతా షాక్ కు గురయ్యారు. 

గద్దర్ బిఎల్ ఎఫ్ కూటమి నుంచి పోటి చేస్తారని అంతా భావించారు. బిఎల్ ఎఫ్ కూటమి దాదాపు గద్దర్ సీటు కూడా ఖరారు చేసింది. గద్దర్ సీఎం కేసీఆర్ పై పోటి చేస్తానని గతంలోనే చెప్పారు. ప్రజా ఆశీస్సులు ఉంటే తప్పక విజయం సాధిస్తానని, మీ పాటనై వస్తానని గతంలోనే గద్దర్ చెప్పారు. గద్దర్ ఆది నుంచి కూడా వామపక్షాల సానుభూతిపరుడిగా ఉన్నారు. గద్దర్ సడన్ గా కాంగ్రెస్ లో చేరే నిర్ణయం తీసుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. గద్దర్ గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.  

గద్దర్ ఇంతటి షాకింగ్ డిసిషన్ తీసుకుంటారని ఎవరూ ఊహించలేదని వామపక్ష నేతలంటున్నారు. వామపక్షాల నుంచి పోటి చేస్తే గెలవలేననే అభద్రతా భావంతోనే పోయాడేమో అని మరికొందరంటున్నారు. ఎన్నికల వేళ రాజకీయాలలో పలు మలుపులు తిప్పుతూ నేతలు ప్రజలకు, పార్టీలకు షాక్ నిస్తున్నారు. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మ భార్య పద్మిని రెడ్డి బిజెపిలో చేరి తిరిగి పది గంటల్లోనే కాంగ్రెస్ లో చేరి షాకిచ్చారు. ఇప్పుడు గద్దర్ ఢిల్లికి పోయే వరకు కూడా ఎవరికి తెలియకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంటే నేతలు పకడ్బందిగా తమ ప్లాన్ లతో ముందుకు వెళ్తున్నారని అర్ధమైతుంది. 

గద్దర్ మెదక్ జిల్లాలోని తూఫ్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్ నగర్ లో జరిగింది. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుకుగా పాల్గొన్నారు. భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. దీని కోసం ఆయన బుర్ర కథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శన చూసిన దర్శకులు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రతి ఆదివారం తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971 లో నరసింగరావు ప్రోత్సాహంతో మొదటిపాట ఆపర రిక్షా పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. అందుకే ఆయన పేరు గద్దర్ గా స్థిరపడింది. 

కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975 లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాసారు. అయన కెనరా బ్యాంకులో క్లర్క్ గా  ఉద్యోగంలో చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల.

మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు.

మహారాష్ట్ర,, మధ్యప్రదేశ్, బరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన మరియు ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. 

గద్దర్ మావోయిస్టు సానుభూతిపరుడిగా ఉండేవారు. దీంతో 1997 ఏప్రిల్ 6న ఆయన పై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు వెళ్లాయి. అన్ని బుల్లెట్ లను తొలగించినా ఒక్క బుల్లెట్ మాత్రం గద్దర్ శరీరంలోనే ఉంది. అది తొలగిస్తే గద్దర్ ప్రాణాలకు ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి కూడా బుల్లెట్ ఉంది.

అప్పటి నుంచి నక్సలైట్ పార్టీలోనే ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. వామపక్ష సానుభూతి పరుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటలతో కీలక పాత్ర పోషించారు. అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్ద మీద పోరు తెలంగాణమా అనే పాటలను ఉద్యమకారులను ఉర్రూతలూగించాయి.