ఏపీలో ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నడుమ నడుస్తున్న తెరపడేలా లేదు. ఇరు పక్షాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తూ వెనక్కు తగ్గకుండా ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుబడితే కరోనా కారణం ఎన్నికలు పెట్టడానికి తాము ఒప్పుకోమని ప్రభుత్వం అంటోంది. అసలు తమ సహకారం లేకుండా ఈసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని, ప్రభుత్వానిదే తుది నిర్ణయమని చెబుతోంది. ఇరువురు హైకోర్టును ఆశ్రయించగా ఇరువు చర్చించుకుని ఒక నిర్ణయానికి రమ్మని కోర్టు సూచించింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్ సింఘాల్ శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌ఈసీ నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ప్రభుత్వ సిఎస్ కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్ కార్యక్రమం నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేయగా సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించేశారు. ప్రొసీడింగ్స్ కూడ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఈసీ ఇలా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం పట్ల ప్రభుత్వం తీవ్ర సహనంతో ఉంది. ఇన్ని నెలల నుండి వద్దని చెబుతున్నా ఇప్పుడు ఏకంగా నోటిఫికేషన్ ఇచ్చేయడంతో ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జగన్ సర్కార్ భావిస్తోందట. అసలే జగన్ తన మాటే వేదం అన్నట్టు ఉంటారు. స్పెషల్ గెజిట్ వదిలి నిమ్మగడ్డను పదవి నుండి పక్కకు పుట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చివరకు ఎదురుదెబ్బే తగలడం, నిమ్మగడ్డ మళ్ళీ పదవిలోకి రావడం తెలిసిందే.
మొదటి ప్రయత్నంలో వెనకడుగు వేయాల్సి రావడంతో ఈసారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పైచేయి సాధించాలనే చూస్తోంది. అందుకే ఈసీ నోటిఫికేషన్ కోర్టును ఆశ్రయించి కరోనా తీవ్రత, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్, ప్రభుత్వ సిబ్బంది కొరత లాంటి కారణాలను చూపి ఎన్నికలను వాయిదా వేయించాలని భావిస్తోంది. మరి ప్రభుత్వం తరపున పిటిషన్ సుప్రీం కోర్టు స్వీకరిస్తుందా, స్వీకరించి ప్రభుత్వ నిర్ణయాలను బలపరిచి ఎన్నికలను వాయిదా వేస్తుందా అనేది చూడాలి.
AP Government to file petition to stop local body elections