ఏపీలో సీబీఐ, ఏసీబీ మధ్య కోల్డ్ వార్ మొదలయింది. సిబిఐ రాష్ట్రంలో కాలుపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం జివొ విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీనితో అవినీతికి సంబంధించిన సిబిఐ జూరిష్ డిక్షన్ ఎవరు చూాడాలి. సిబిఐ రాష్ట్రంలోకి రాలేదుకాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కూ డా అవినీతిని తామే నిర్మూలిస్తామని ఆంధ్ర ప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ అంటోంది. అనడమేమిటని ఏకంగా దాడులు కూడా మొదలుపెట్టింది.
నిన్న మచిలీ పట్నంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి పరమేశ్వరన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రమనేశ్వర్ విషయంలో ఏపీ ఏసీబీ తీరుపై సీబీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది
సీబీఐకి వచ్చిన ఫిర్యాదుపై ట్రాప్ చేసేందుకు మేం ప్రయత్నించామని, ఈ కేసు మీద ముందస్తు అనుమతి కోరినా ఏపీ హోం శాఖ అనుమతి ఇవ్వలేదని సిబిఐ అంటున్నది. దీనికి అభ్యంతరం కూడా చెప్పింది
ఇలానే ఏపీ ఏసీబీ వ్యవహరిస్తే అవినీతి నిర్మూలన కష్టమని సీబీఐ అభిప్రాయపడింది.
అయితే, ఏసీబీ ట్రాప్ ను ఏపీ హోం శాఖ సమర్థించుకుంది.
సీబీఐ దాడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉపసంహరించుకుందని అందువల్ల సీబీఐ ట్రాప్ కు ఎలా అనుమతి ఇస్తామని ఆంధ్రా పోలీసులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులలో అవినీతి నిర్మూలన వ్యవహారం కూాడా మాదే నని చెబుతున్నారు
ఇక ముందు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు వస్తే ట్రాప్ చేస్తామని ఎసిబి అధికారలు చెబుతున్నారు.
ఈ విషయంలో తను ఎవరూ అడ్డుకోలేరని కూడా అంటున్నారు.