రిషిని వెతుక్కుంటూ వెళ్లిన వసుధారా…. వసుధార మాటలు పట్టించుకోని రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. సుమిత్ర వసుధారకు ఫోన్ చేసి తన తండ్రి మారారని సంతోషపడుతుంది అలాగే రిషి సార్ ను కలిసావా అంటూ అడుగుతుంది ఆయన నిన్ను అర్థం చేసుకుంటారు తన మనసు ఎంతో మంచిది అని సుమిత్ర చెబుతుంది. అప్పుడు వసుధార రాజీవ్ బావతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతుండగా చక్రపాణి వాడు ఎంత మోసం చేశాడు అని రాజీవ్ పై కోప్పడతాడు.

మరోవైపు రిషి సోఫాలో పడుకొని వసుధార గురించి ఆలోచిస్తాడు నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పిన నువ్వు చివరికి ప్రశ్నగా మారిపోయావు అంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు వసుధారా రిషి ఇచ్చిన పువ్వులను చూస్తూ రిషి గురించి ఆలోచిస్తూ తనకు మెసేజ్ చేస్తుంది. అయితే ఆ మెసేజ్ చూసిన రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు.మరొకరికి భార్య అయినటువంటి వసుధార నాతో ఎందుకు మాట్లాడింది నేను ఇచ్చిన పువ్వులు ఎందుకు తీసుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా బాల్కనీలో బయటకు వెళ్లి చందమామని చూస్తూ ఇద్దరు కూడా మా మధ్య ఈ దూరం ఎందుకు ఈ దూరం ఎప్పుడు తగ్గుతుంది అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక వసుధార మాత్రం రిషి సార్ ఎక్కడికి వెళ్లి ఉంటారని తన గురించి ఆలోచిస్తూ కాలేజ్ కి వెళ్తుంది.

అక్కడ రిషికి ఫోన్ చేసిన జగతికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇక ధరణికి ఫోన్ చేసి అడగగా రిషి గురించి తెలియదని చెబుతుంది. కాలేజీలో రిషి వసుధార ఎప్పుడు కలుసుకునే చోటుకు వెళ్లి తన జ్ఞాపకాలు అన్నిటిని గుర్తు చేసుకుంటుంది.ఇలా ఆలోచిస్తూ ఉన్నటువంటి వసుధార రిషి సార్ బహుశా కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నారా అనుకొని అక్కడికి వెళుతుంది. లోపల నుంచి రిషి బయట వైపు నుంచి వసుధార ఒకేసారి డోర్ తీయడంతో ఒక్కసారిగా వసుధార కింద పడబోతూ ఉండగా రిషితనని పట్టుకుంటాడు. ఆ సమయంలో వసుధార మెడలో ఉన్నటువంటి తాళి రిషి షర్టుకు తగులుకోవడంతో తాళి తీసి పక్కకు వెళ్తాడు.

ఇక్కడికి ఎందుకు వచ్చావు వసుధార అనడంతో సర్ నేను మీతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలి మీకు చెప్పాల్సింది చాలా ఉంది అనడంతో ఇప్పుడు నేను ఏమి వినాలి అనుకోవడం లేదు అంటూ తనని అవాయిడ్ చేస్తాడు.ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండి అయినా మీరు నాకు ఆ సమయం ఇవ్వాలి సార్ అంటూ చెప్పగా వసుధార ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ రిషి చెబుతాడు.ఇలా కాదు సార్ అంటూ ఈమె వాట్సప్ లో మహేంద్ర సార్ రిషి సార్ కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు అంటూ వాయిస్ మెసేజ్ చేస్తుంది.

ఇలా చేసేసరికి వసుదారా ఏం చేస్తున్నావు అంటూ రిషి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఇక చేసేదేమీ లేక వసుధార అక్కడి నుంచి వచ్చేస్తుంది.మరోవైపు చక్రపాణి వసుధారకు ఫోన్ చేసి మాధవికి ఒంట్లో నలతగా ఉందట మీ అమ్మ అక్కడికి వెళుతుంది నాకు ఎందుకో నీ దగ్గరికి రావాలని ఉంది అని వసుధారతో మాట్లాడటంతో రండి నాన్న అంటూ వసుధార పిలుస్తుంది.రిషి కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విషయం వసుధారకు ఎలా తెలుసు వసుధార అక్కడకు ఎందుకు వెళ్ళింది అసలు మీరంతా ఏం చేస్తున్నారని అందరిపై దేవయాని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.