తన మాటలతో దేవయానికి షాక్ ఇచ్చిన వసు… వాసు పరువు తీయడం కోసం మరో ప్లాన్ చేసిన దేవయాని!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…వనభోజనాల కోసం వసుధార రెడీ అవుతూ ఉండగా రిషి వెళ్లి తన తలలో గులాబీ పువ్వు పెట్టి ఇద్దరు అద్దం ముందు నిల్చుని చూసుకుంటూ ఉంటారు.మరోవైపు గౌతమ్ తొందరగా రారా రిషి అని చెప్పడంతో రిషి వసుధార తొందరగా వచ్చేసేయ్ అని చెప్పి అక్కడికి వెళ్తాడు. బయటకు వెళ్లిన రిషిని చూసి గౌతం నీ డ్రెస్ చాలా బాగుందిరా అని అడుగుతాడు మరి నా డ్రెస్ ఎలా ఉంది అని అడిగగా నేను చెబితే బాగోదు అంటూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.

మరోవైపు దేవయానికి కాలి నొప్పితో బాధపడుతూ ఉండగా అంతలోనే వసుధారా చీర కట్టుకొని పైనుంచి కిందికి దిగివస్తూ ఉంటుంది. దీంతో తనని చూసిన దేవయాన్ని షాక్ అవుతుంది. ఏంటి వసుధార కొత్త చీరన అని దేవయాని అడగగా అవును మేడమ్ నాకోసం రిషి సార్ తీసుకువచ్చారు రిసీ సార్ సెలక్షన్ చాలా బాగుంది కదా అంటూ వసుధార మాట్లాడటంతో దేవయాని మండిపోతూ ఉంటుంది. దీంతో ఈ వసుధర ఆగడాలు ఎలాగైనా ఆపాలి అంటూ కాలేజ్ స్టాఫ్ కి ఫోన్ చేసి మరో ప్లాన్ వేస్తుంది.

ఇక అందరూ కూడా సంతోషంగా వనభోజనాలకు వెళుతూ ఉండగా వసుధార అక్కడికి వెళ్లి వంట పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. అంతలోనే గౌతం చెఫ్ వేషంలో వెళ్లి వంటలన్నీ ఎలా జరుగుతున్నాయి అని అడగ్గా ఒక్కసారిగా రిషిని చూసి వసు షాక్ అవుతుంది.తనతో కలిసి సెల్ఫీ దిగడమే కాకుండా మా రిషి సార్ కి ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం వెంటనే చేయించండి అని చెబుతుంది. ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్న తర్వాత మీకు ఈ వేషం ఏం బాలేదు సార్ తీసేయండి అని చెబుతుంది. ఇక గౌతమ్ కూడా అక్కడ దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటూ ఉంటారు.

అంతా చాలా బాగా జరుగుతుంది కదా వసుధార అని అడగ్గా అవును అని మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే డాడ్ వాళ్లు కూడా వచ్చి ఉంటే బాగుండేది అని రిషి అనడమే కాకుండా గత ఏడాది జరిగిన వనభోజనాలు గురించి అన్ని విషయాలను గుర్తు చేసుకుంటారు. ఇక అన్ని జాగ్రత్తగా చూసుకో వసుధార అని చెప్పి రిషి వెళ్తుండగా వసుధార జాకెట్ హుక్ ఊడిపోవడం రిషి చూసి ఉంటాడు.ఏం చేయాలో తెలియక ఫోటో తీసి వసుధారకు పంపించగా వసుధార హుక్ ఎలా వేసుకోవాలో తెలీక ఇబ్బంది పడుతూ ఉంటుంది.

అది గమనించిన రిషి తనకు హుక్ వేస్తూ ఉండగా కొందరు కాలేజ్ స్టాఫ్ దానిని చూసి రిషి వసు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వసుధార బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇది గమనించిన గౌతమ్ కాలేజీ స్టాప్ ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెళ్లి ఇందులో తప్పేముంది తాను ఇబ్బంది పడుతూ ఉండగా రిషి తనకు హెల్ప్ చేశాడు మీ ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి మీకు తెలియదా..ఇంత జరిగిన వసు మౌనంగా ఎందుకు వెళ్ళింది అంటే అది కేవలం తన సంస్కారం మాత్రమే మీరు వెళ్లి ఇప్పుడే వసుధారకు సారి చెప్పారా సరే లేదంటే ఇక ఈ విషయం రిషికి చెప్పాల్సి ఉంటుంది అంటూ వారికి బాగా బుద్ధి చెబుతాడు. మరోవైపు వసుధార ఆ విషయాలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది.